Arjun Reddy Settle with Top 10th Position US Collections | అర్జున్ రెడ్డి కలెక్షన్లు.. అక్కడ అంతే.. అంతే..

Arjun reddy us collections

Arjun Reddy Movie, Arjun Reddy USA Collections, Arjun Reddy Collections, Arjun Reddy USA Collections

Arjun Reddy Movie Collections Closed at US Box Office. Settled in 10th place of Tollywood Telugu Movies List.

అర్జున్ రెడ్డి ఓవర్సీస్ లో 10వ స్థానం

Posted: 09/19/2017 06:36 PM IST
Arjun reddy us collections

బోల్డ్ మూవీ ట్యాగ్ లైన్ తో మొదలైన అర్జున్ రెడ్డి చిత్ర ప్రభంజనం మూడు వారాలపాటు కొనసాగటం విశేషం. పెద్ద చిత్రాలకు కూడా మౌత్ టాక్ ఎంత బాగా ఉన్నా రెండు వారాలకు మించి కలెక్షన్లు రావట్లేదన్న విషయం తెలిసిందే. అలాంటిది విజయ్ దేవరకొండ లాంటి రైజింగ్ స్టార్ పెద్ద వండరే చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి.

చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, సుమారు నాలుగున్నర కోట్లకు అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. అయితే ఓవర్సీస్ లో వండర్స్ క్రియేట్ చేస్తుందని భావించిన ఈ చిత్రం ఓ మోస్తరు కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం అక్కడ మాత్రం టాప్ 10 స్థానంతోనే సరిపెట్టుకుంది.

1.75 మిలియన్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా, 2 మిలియన్ మార్క్ ను చేరుకుంటుందనే అంతా అనుకున్నారు. అలా జరిగి వుంటే మరికొన్ని సినిమాలను వెనక్కి నెట్టేసి ఈ సినిమా ముందుకు వెళ్లేది. కానీ 'అర్జున్ రెడ్డి' ఆశ నెరవేరలేదు .. 1.75 మిలియన్ మార్క్ దగ్గరే ఆగిపోవలసి వచ్చింది. పదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles