Cheating Case on Prabhas's Saaho Heroine | చెప్పిన పని చేయలేదని సాహో హీరోయిన్ పై...

Cheating case on shradda kapoor

Haseena Parkar, Shradda Kapoor, Costumes Brand, Cheating Case, Shradda Kapoor Criminal Case

Cheating Case filed against Actress Shradda Kapoor. She is not promoting Costumes for Haseena Parkar Movie.

ఛీటింగ్ కేసులో శ్రద్ధా కపూర్

Posted: 09/19/2017 05:33 PM IST
Cheating case on shradda kapoor

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ పై ముంబై కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు నమోదు అయ్యింది. హసీనా పార్కర్ చిత్రం కోసం చేసుకున్న ఓ అగ్రిమెంట్ ను ఆమె బ్రేక్ చేయటమే అందుకు కారణమని తెలుస్తోంది. చిత్రంలో తమ బ్రాండ్ దుస్తులను వాడిన ఆమె త‌మ వ‌స్త్రాల బ్రాండ్‌ను ప్ర‌చారం చేయ‌డం లేదంటూ ముంబైకి చెందిన ఓ వ‌స్త్రాల త‌యారీ ఆరోపిస్తోంది.

`ఏజేటీఎమ్ (ఏజే మిస్త్రీ అండ్ థియా మిన్హాస్‌)` అనే వస్త్ర సంస్థ శ్రద్ధా కపూర్ కు కాస్టూమ్స్ సమకూర్చింది. సినిమా ప్రారంభంలోనే అగ్రిమెంట్ లో ప్రమోషన్ సమయంలో కూడా తమ బట్టలనే ఆమె ధరించాలని, తద్వారా తమకు లాభం చేకూరుతుందని అగ్రిమెంట్ లో రాసుకున్నారు. అయితే ఆమె అలా చేయకపోవటంతో సదరు కంపెనీ వాళ్లు సంస్థ శ్ర‌ద్ధా క‌పూర్‌ పైన, నిర్మాతల‌పైన చీటింగ్‌, క్రిమిన‌ల్ కేసుల‌ను పెట్టేశారు.

సినిమాకు వ‌స్త్రాలు పంపిణీ చేసిన‌పుడు, ప్ర‌చారంలో భాగంగా త‌మ బ్రాండ్‌ను ప్ర‌చారం చేస్తామ‌ని చిత్ర నిర్మాత‌లు పేర్కొన్న‌ట్లు వ‌స్త్రాల త‌యారీ సంస్థ ఎమ్ అండ్ ఎమ్ డిజైన్స్ త‌ర‌ఫు న్యాయ‌వాది రిజ్వాన్ సిద్ధిఖీ తెలిపారు. మ‌రోప‌క్క ఈ కేసు విష‌యంపై శ్ర‌ద్ధా క‌పూర్ నుంచి గానీ, నిర్మాత‌ల నుంచి గానీ ఎలాంటి స్పంద‌న రాలేదు. దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి జీవిత క‌థ ఆధారంగా నిర్మించిన `హ‌సీనా పార్క‌ర్‌` సినిమా సెప్టెంబ‌ర్ 22న విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా సాహో, సైనా బయోపిక్ మూవీలో శ్రద్ధ నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles