Sick Humour Cartoon irritate Senior Actor | కార్డూన్.. సెన్సార్ హ్యూమర్ కి నటుడికి ’కాలిపోయింది‘

Bollywood actor serious on cartoon

Rishi Kapoor, Rk Studio Fire Accident, Rishi Kapoor Sick Humour, Rishi Kapoor New Photo, Rishi Kapoor Twitter, Rishi Kapoor AAG Cartoon

Bollywood Senor Hero Rishi Kapoor objects to ‘depraved sick humour’ of a cartoon on RK studio fire. Rishi Kapoor objected to the “sick humour” of a cartoon on the recent fire incident at RK Studio.

కార్టూన్ పై సీరియస్ అయిన బాలీవుడ్ నటుడు

Posted: 09/19/2017 05:02 PM IST
Bollywood actor serious on cartoon

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ కి మండిపోయింది. తన తండ్రిని ఉద్దేశిస్తూ.. ఓ మాగ్జైన్ ప్రచురించిన కార్టూన్ ఆయనకు చిరాకు తెప్పించింది. తన జీవితంలోనే ఇంత చెత్త కార్టూన్ చూడలేదంటూ ఆయన మండిపడుతున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే... ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న కపూర్ ఫ్యామిలీకి చెందిన ఆర్‌కే స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శనివారం సెలవు దినం కావటంతో ప్రాణ నష్టం ఏం సంభవించలేదు. మరమత్తులకు మరో నెల రోజులు పట్టొచ్చని ఆయన తన ట్విట్టర్ లో స్వయంగ వెల్లడించారు కూడా. అయితే ఓ కార్టూన్‌లో ఆర్‌కే స్టూడియో ద‌గ్ధ‌మ‌వుతుండగా పై నుంచి రాజ్ క‌పూర్ చూస్తూ `అగ్ని మంచి సంకేత‌మే.. నా జీవితం మ‌లుపు తిరిగిందే.. అగ్ని(ఆగ్ ఆయన తొలి చిత్రం) వ‌ల్ల‌` అంటున్న‌ట్లుగా చూపించారు. పైగా రాజ్‌క‌పూర్ అందులో న‌వ్వుతున్న‌ట్లుగా ఉంది.

కడసారి చూపులకు.. సిగ్గు లేదా?

 

దీంతో రిషి కపూర్ ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. ఈ మధ్య కాలంలో తాను చూసిన అతి చెత్త కార్టూన్ ఇదేనంటూ కామెంట్ చేశారు. `కావాల‌నుకుంటే మ‌ళ్లీ స్టూడియోను నిర్మించుకోవ‌చ్చు. కానీ దానితో ఉన్న జ్ఞాప‌కాల‌ను తిరిగి తీసుకురాలేం` అని రిషిక‌పూర్ మ‌రో ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles