CBI willfully careless Jia Khan Suicide Case |

Jia khan mother writes letter to pm modi

Jia Khan, Jia Khan Death, Jia Khan Suicide Case, Jia Khan Case CBI Careless, Jia Khan Mother Rabiya Khan, Jia Khan Death Mystery, Jia Khan Case PM Modi, Narendra Modi Bollywood Actress Case

Jiah Khan’s mother Rabiya Khan writes an open letter to PM Narendra Modi seeking justice. The mother of Jiah Khan, who committed suicide in 2013, has open letter addressed has written an open letter addressed to Prime Minister Narendra Modi beseeching him for justice. Rabiya Khan pulled up the CBI for being willfully careless when the case was transferred to them.

జియా ఖాన్ కేసుపై మోదీకి లేఖ

Posted: 09/18/2017 06:32 PM IST
Jia khan mother writes letter to pm modi

బాలీవుడ్ లో  నిశ్శ‌బ్ద్‌, గ‌జిని, హౌస్‌ఫుల్‌ వంటి చిత్రాల్లో నటించి యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న నటి జియా ఖాన్ 2013లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఆమె అంత పని చేసిందని చెబుతున్నప్పటికీ.. జియా బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీ హత్య చేశాడని(సూసైడ్ కు ప్రేరేపించటం) టాక్ అప్పట్లో వినిపించింది. ఇదే మాటను మొదటి నుంచి చెబుతూ ఆమె ఆమె త‌ల్లి ర‌బియా ఖాన్ న్యాయపోరాటం చేస్తూ వస్తోంది కూడా.

ఈ కేసు విష‌యంలో న్యాయం చేయాలని కోరుతూ ఇప్పడు ఆమె త‌ల్లి ర‌బియా ఖాన్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. త‌న కూతురు కేసు విష‌యంలో సీబీఐ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరిస్తోంద‌ని ఆమె లేఖ‌లో పేర్కొంది. అలాగే త‌న కూతురిది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌లాగా క‌నిపించేలా చేశార‌ని ఆమె తెలిపింది. అందుకు జియా ఖాన్ ఒంటి మీద గాయాల ద్వారా ఆ విష‌యం తెలుస్తుంద‌ని చెప్పింది.

ఆ విష‌యానికి ధ్రువీక‌రించే ఫోరెన్సిక్ ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ర‌బియా ఖాన్ లేఖ‌లో తెలియ‌జేసింది. త‌న కూతురి కేసులో విచార‌ణ జ‌ర‌ప‌డానికి సీబీఐ మొద‌ట్నుంచి అనాస‌క్తి చూపిస్తోంద‌ని, వాళ్లు త‌ల‌చుకుంటే జియా ఖాన్ హ‌త్య‌కు సంబంధించి అన్ని ర‌కాల ఆధారాలు క‌నిపెట్ట‌గ‌ల‌ర‌ని, కాకపోతే వాళ్లు తాను చెప్పేది కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆమె ఆరోపించింది. బ్రిటిష్ ఫోరెన్సిక్ నిపుణులు ఆమెది హత్యేనని తేల్చిన నివేదికను ఆమె లేఖలో ప్రస్తావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles