PK25 Pre Release Business in Nizam Sold to Dil Raju | లవకుశ, స్పైడర్ మరియు పీకే25.. రాజుగారి రిస్క్?

Dil raju nizam biggies movies

Pawan Kalyan, PK25 Nizam Rights, Pawan kalyan Dil Raju, Jai Lavakusa PK25 SPYder Nizam Business, NTR, Mahesh and Pawan, PK 25 Pre Release Business

Dil Raju is releasing SPYder and PK25 in Nizam, and Jai Lava Kusa in Nizam and Uttarandhra. Dil Raju's Gambling With NTR, Pawan, Mahesh Movies with record price rate.

జై లవకుశ, స్పైడర్, పీకే 25 హక్కులు దిల్ రాజుకే!

Posted: 09/13/2017 02:57 PM IST
Dil raju nizam biggies movies

టాలీవుడ్ లో ఈ యేడాది లక్కీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ముమ్మాటికీ నిర్మాత దిల్ రాజు. ఆయన పట్టిందల్లా బంగారం అయ్యి కూర్చుంది ఈ యేడాది. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా మొత్తం మీద దగ్గర్లో దగ్గర 50-60 కోట్లు ఆయన వెనకేసుకున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు అగ్రహీరోల సినిమాలపై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. సెట్స్ పై ఉండగానే ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నైజామ్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం ఆయన 29 కోట్లను చెల్లించాడని అంటున్నారు. నైజామ్ ఏరియాలో 'బాహుబలి' తరువాత ఈ స్థాయి రేటు పలికి సినిమా ఇదేనని చెబుతున్నారు.

ఇంతకు ముందు మహేష్ చిత్రం స్పైడర్ కోసం 23 కోట్లు వెచ్చినట్లు చెప్పుకున్నాం. అదే సమయంలో జై లవకుశ కోసం 20 కోట్లు వెచ్చించాడు. జనతా గ్యారేజ్ 17 కోట్లు వసూలు చేయటంతో అంత రేటు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర హక్కులను కూడా రాజే సొంతం చేసుకోవటం విశేషం. మొత్తానికి పెద్ద చిత్రాల ద్వారా గతంలో పెద్దగా లాభపడని దిల్ రాజు ఈసారి మాత్రం చాలా రిస్క్ చేస్తున్నామో అని చెప్పుకుంటున్నారు. అయితే పండగ సీజన్లో సినిమాలు వస్తుండటంతో ఫ్రాఫిట్ జోన్ ఖాయమన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles