Illegal movie download website TamilRockers Admin Arrest | పైరసీ వ్యూవర్స్ కు బ్యాడ్ న్యూస్.. తమిళ్ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్.. విశాల్ విక్టరీ

Vishal keeps his promise tamil rockers admin arrest

Illegal Movie Download Website, Tamil Rockers Website, Tamil Rockers Admin Arrest, Tamil Rockers Gauri Shankar, Vishal Tamil Rockers, Tamil Rockers Admin Abscond, Tamil Rockers South Movies

Illegal movie download website TamilRockers Admin Gauri Shankar Arrested in Chennai. Actor Vishal Keeps His Promise.

విశాల్ విక్టరీ.. తమిళ్ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్

Posted: 09/13/2017 01:29 PM IST
Vishal keeps his promise tamil rockers admin arrest

తమిళ సినిమాల్లో కొన్నేళ్లుగా సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. అయితే మిగతా భాషల్లో కంట్రోల్ చేయగలుగుతున్నప్పటికీ.. పైరసీ భూతం కోలీవుడ్ ను దారుణంగా దెబ్బేస్తూ వస్తోంది. రజనీకాంత్, విజయ్, సూర్య.. ఇలా ఎవరి చిత్రాన్ని వదలకుండా రిలీజ్ అయిన రోజే లీక్ చేసి పడేస్తున్నారు.

ముఖ్యంగా ఏ సినిమా అయినా, రిలీజ్ అయిన రోజే పైరసీ చేయడంలో దిట్టయిన 'తమిళ్ రాకర్స్' వ్యవహారం మరీ తలనొప్పిగా మారింది. దీనిపై తాను నడిఘర్ సంఘ కార్యదర్శి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నటుడు విశాల్ హెచ్చరిస్తూ వస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ వెబ్ సైట్ నిర్వాహకులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గటం లేదు. ఛాలెంజ్ చేసి మరీ కొత్త సినిమాలను లీక్ చేసి పడేశారు. నిర్మాతల సంఘం, నడిఘర్ ప్రయత్నించినా వారిని అడ్డుకోలేకపోయారు.  ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చెన్నై పోలీసులు తమిళ్ రాకర్స్ నిర్వాహకులను కటకటాల వెనక్కు పంపించారు.

'తమిళ్ రాకర్స్' వెబ్ సైట్ అడ్మిన్ గౌరీ శంకర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇతను మూడో కీలక నిందితుడని, మిగతా వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. అయితే అందరినీ అరెస్ట్ చేసిన తరువాత మాత్రమే వెబ్ సైట్ ను పూర్తిగా మూసివేయగలమని పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Manchu manoj tweet on mega hero

  మెగా హీరోపై మంచు మనోజ్ ట్వీట్

  Nov 23 | మెగా-మంచు ఫ్యామిలీల మధ్య కొంత కాలం క్రితం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. పైకి నవ్వుతూ మాట్లాడుతూనే సెటైర్లు వేసుకోవటం ఆయా హీరోలకు అలవాటే. వజ్రోత్సవాలు వేదికగా.. చిరు-మోహన్ బాబు స్పీచ్ లు... Read more

 • Prakash raj legal notices to bjp mp

  బీజేపీ ఎంపీకి ప్రకాశ్ రాజ్ లీగల్ నోటీసులు

  Nov 23 | అవకాశం దొరికిన‌ప్పుడ‌ల్లా కేంద్ర ప్ర‌భుత్వంపై న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి రానంటూనే.. కన్నడ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై... Read more

 • Akkineni book not launched by pawan

  మన అక్కినేని పవన్ లాంఛ్ చేయలేదంట!

  Nov 23 | నిన్న టాలీవుడ్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ప్రముఖ రచయిత సంజయ్ కిషోర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత కోణంలోని పలు అంశాలను సేకరించి మన అక్కినేని పేరిట ఓ పుస్తకం రాశారు.... Read more

 • Bunny replaces ntr project

  ఎన్టీఆర్ ఎగ్జిట్.. బన్నీతో కొరటాల ఫిక్స్

  Nov 23 | హ్యాట్రిక్ దరశకుడు కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తోనే ఓ చిత్రం ఉండబోతుందని ఆ మధ్య... Read more

 • Amala paul cheating puducherry transport dept

  అమలాపాల్ కారు మోసం ఎంతలా అంటే...

  Nov 23 | నటి అమలాపాల్ కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం కొన్నాళ్ల క్రితం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆ వ్యవహారంలో జోక్యం కల్పించుకుని విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. ఆ తర్వాత... Read more

Today on Telugu Wishesh