Tollywood Senior Actor Chinna Wife Died | సీనియర్ నటుడు చిన్నా ఇంట విషాదం.. భార్య కన్నుమూత.

Actor chinna wife died

Tollywood, Senior Actor Chinna, Chinna Wife Death, Actor Chinna's Family, Actor Chinna Real Name, Actor Chinna Daughters, Chinna Family Photos, Chinna Real Name, Actor Jitendra Reddy, Tollywood Sad News, Tollywood Death

Tollywood Senior Actor Chinna's Wife Sirisha Died due to Prolong Illness.

నటుడు చిన్నా వైఫ్ శిరీష కన్నుమూత

Posted: 09/13/2017 12:59 PM IST
Actor chinna wife died

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చిన్నా భార్య శిరీష(42) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

జితేంద్ర రెడ్డి అలియాస్ చిన్నా రాంగోపాల్ వర్మ సెన్సేషన్ మూవీ శివతోనే టాలీవుడ్ లో ఆరంగ్రేటం చేశారు. ఆ సినిమాలో క్యారెక్టర్ చిన్నా కావటంతో అదే పేరు తర్వాత ఆయనకు సార్థకం అయిపోయింది. వర్మ చిత్రాలతోపాటు సుమారు 100కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. కమెడియన్ క్యారెక్టర్లతోపాటు సహాయక పాత్రలు ఆయన పొషించారు. నిర్మాతగా.. దర్శకుడిగా కూడా ఆ మధ్య కొన్ని సినిమాలు తీశారు.

ఆ తర్వాత ఆయన సీరియళ్లకు అంకితం అయిపోయారు. భార్య శిరీష మృతితో చిన్నా కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనను పరామర్శించారు. చిన్నా-శిరీష దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తెలుగు విశేష్ తరపున ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Tholi prema first week collections

  తొలిప్రేమ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

  Feb 17 | మెగా హీరో వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో రొమాంటిక్ డ్రామాగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'తొలిప్రేమ' సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలివారం కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఒక్క... Read more

 • Prabhas involvement in happy wedding

  హ్యాపీ వెడ్డింగ్.. ప్రభాస్ హ్యాండ్ ఎలాగంటే...

  Feb 17 | ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉంటూ డార్లింగ్ అన్న పేరును సార్ధకం చేసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తనకు కావాల్సిన వాళ్ల చిత్రాల ఈవెంట్లకు హాజరవుతూ ప్రమోషన్లలో కూడా పాలుపంచుకుంటుంటాడు. అలాంటి హీరో.. తనకు... Read more

 • Kanam movie again postponed

  సాయి పల్లవి కణం మళ్లీ వాయిదా

  Feb 17 | ప్రేమమ్ మలార్ టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే ఆడియన్స్ ను ఫిదా చేసేసింది. తర్వాత ఎంసీఏతో ఆకట్టకున్న ఆమె తమిళ డెబ్యూకి రెడీ అయిపోయింది. బైలింగువల్ కరు(తమిళ్), కణం(తెలుగు)తో పలకరించేందుకు సిద్ధమైపోయింది. అయితే ఈ... Read more

 • Sumanth on upcoming projects

  ఇకపై మాస్ పాత్రలు చెయ్యను : సుమంత్

  Feb 17 | కెరీర్ ప్రారంభంలో వరుసగా సక్సెస్ లు చూసిన అక్కినేని హీరో సుమంత్.. తర్వాత వరుసగా ఓ టైప్ ఆఫ్ సినిమాలతో బోల్తా పడ్డాడు. ఆ మధ్య గోదావరి, గోల్కొండ హై స్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ... Read more

 • Rana daggubati condemns rumour

  ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు : రానా

  Feb 16 | సోషల్ మీడియాలో చెలరేగే పుకారు.. దాని పట్టుకునే కొన్ని వెబ్ సైట్లు రాసే వార్తలు సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు సెలబ్రిటీలు మాత్రం వాటిని... Read more

Today on Telugu Wishesh