హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయటం కొత్తేం కాదు. జంగిల్ బుక్ సుమారు 150 కోట్లు వసూలు చేసి మన చిత్రాలకే పెద్ద సవాల్ విసిరింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయి చిత్రాలేవీ ఇక్కడ రిలీజ్ కాలేదు. కానీ, ఇప్పుడు ఓ మోస్తరు చిత్రంతో ఓ హర్రర్ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది.
ప్రముఖ ఆంగ్ల రచయిత స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా తెరకెక్కిన `ఇట్` సినిమా భారతదేశ మార్కెట్‌లో కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 11 కోట్లకి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డెంజిల్ డయాస్ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి ఆండీ మూషెట్ దర్శకత్వం వహించారు. అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటివరకు 117.2 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు సమాచారం. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ మొత్తంలో ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మొదటి హార్రర్ చిత్రంగా `ఇట్` నిలిచింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more