సమంత లాగే చేసే సీన్ ఉందా? | Poonam Kaur Handloom Brand Ambassador for AP

Poonam kaur to be brand ambassador of ap handlooms

Actress Poonam Kaur, Andhra Pradesh Handloom Ambassador, Poonam Kaur Samantha, Poonam Kaur Chandrababu Naidu, Chandrababu AP Samantha, KTR Samantha Chandrababu Naidu Poonam Kaur

Punjabi Beauty Poonam Kaur Brand Ambassador for Andhra Pradesh Handloom. AP CM Chandrababu Naidu Announced that news. Poonam Compared with Samantha Now.

ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ కౌర్

Posted: 09/12/2017 04:53 PM IST
Poonam kaur to be brand ambassador of ap handlooms

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కు విశిష్ట స్థానం దక్కింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

పంజాబ్ లో పుట్టి హైదరాబాద్ లో సెటిల్ అయిన పూనమ్ కౌర్.. పలు సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి కనువిందు చేసింది. అంతేకాదు హ్యాండ్ లూమ్ గురించి ఆమెకు బోలెడంత అవగాహన కూడా ఉంది. దీంతో ఆమెను అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కోసం దాదాపూ ఎనిమిది సంవత్సరాలపాటు శ్రమించి నూలుతో రూపొందించిన చార్మినార్‌ చిత్రాన్ని పూనమ్‌ కౌర్‌ బహుకరించింది. ఇక తనని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన పూనం సంతోషం వ్యక్తం చేసింది.

తను డాక్టర్‌నో, ఇంజనీర్‌నో కావాలనుకున్నానని, అయితే అనూహ్యంగా ఫ్యాషన్‌ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టానని అన్నారు. ఫ్యాషన్‌ టెక్నాలజీకి చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో దానిపై అభిరుచి పెంచుకున్నానని అన్నారు. తెలంగాణలో సమంత చేనేత రంగానికి అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత స్థాయిలో క్రేజ్ లేని పూనమ్ ఏ మేర చేనేతకు దోహదపడుతుందోనని పలువురు పెదవి విరుస్తున్నారు.

ఇంతకీ శామ్ అంబాసిడర్ కాదా?

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles