తమిళ్ లో స్పైడర్ హవా... ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే షాకవ్వాల్సిందే! | SPYder Tamil Pre Release Business Shocks.

Spyder pre release plans

Mahesh Babu, SPYder Movie, SPYder Satellite Rights, SPYder Overseas Rights, SPYder Craze in Overseas,SPYder Biggest Indian Release

Mahesh Babu's SPYder Biggest Indian release in USA. Tamil Satellite Rights sold out for Whopping Amount.

స్పైడర్ తమిళ రైట్స్ రికార్డు ధర.. ఓవర్సీస్ లో భారీ రిలీజ్

Posted: 09/12/2017 04:22 PM IST
Spyder pre release plans

స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కిన 'స్పైడర్' ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ తో హాట్ టాపిక్ గా మారుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని మళయాళం, హిందీలతోపాటు అరబిక్ భాషలో కూడా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే టీజర్, పాటలకు అంతంత మాత్రం స్పందన వస్తుండగా, బిజినెస్ మాత్రం ఒక రేంజ్ లో జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.

తమిళ శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు సొంతం చేసుకున్నారనేది తాజా సమాచారం. అయితే వాళ్లు ఎంత చెల్లించారనేది తెలియదుగానీ, ఫ్యాన్సీ రేటుకే ఈ రైట్స్ అమ్ముడైనట్టు టాక్. మరోవైపు మహేష్ కు క్రేజ్ ఉన్న ఓవర్సీస్ లోనూ భారీ బిజినెస్ జరుగుతోందని సమాచారం. అందుకు తగ్గట్లే రిలీజ్ కూడా చేయబోతున్నారంట. మొత్తం 400 ఫ్లస్ లోకేషన్లలో స్పైడర్ రిలీజ్ కాబోతుంది. తెలుగులో 250 లోకేషన్లు 600 స్క్రీన్లు కాగా, తమిళ వర్షన్ కోసం 160 లోకేషన్లలో విడుదల అవుతోంది.

ఈ నెల 9వ తేదీన చెన్నైలో భారీస్థాయిలో ఆడియో రిలీజ్ వేడుక జరిపిన ఈ సినిమా టీమ్, 15వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తోంది. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఎస్ జే సూర్య, మరో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషిస్తుండగా, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి కూడా నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles