Shankar and Rajamouli Confirmed for SPYder Audio Launch

Spyder audio chief guests confirmed

SPYder Movie Audio Function, Director Shankar, Director SS Rajamouli, Chennai, Mahesh Babu, AR Murugadoss, Rakul Preet Singh

SPYder Movie Chief Guests Confirmed for Audio Launch. Directors Shankar and SS Rajamouli Attend for That Ecent. Murugadoss's Spy thriller release on September 21st.

స్పైడర్ ఆడియో ఫంక్షన్ కు రాజమౌళి, శంకర్.. ఆ వార్త నిజం కాదంట!

Posted: 09/06/2017 05:16 PM IST
Spyder audio chief guests confirmed

మహేశ్ బాబును తమిళ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. అదేనండీ స్పైడర్ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకకు పనులు ప్రారంభం అయిపోయాయి. సెప్టెంబర్ 9న చెన్నైలో భారీ ఈవెంట్ ను నిర్వహించబోతుంది చిత్ర నిర్మాణ సంస్థ లైకా.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'స్పైడర్' సినిమా కోసం ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు .. మురగదాస్ డైరక్టర్ కావటంతో అటు కోలీవుడ్ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తమిళ ఆడియోనే ముందు రిలీజ్ చేస్తారని సమాచారం. అటుపై తెలుగు వెర్షన్స్ కి సంబంధించిన ఆడియోను రిలీజ్ చేస్తారు.

ఇక చిత్రానికి సంబంధించి బిగ్ న్యూస్ ఏంటంటే.. ముఖ్య అతిథులుగా టాలీవుడ్ నుంచి రాజమౌళిని .. కోలీవుడ్ నుంచి శంకర్ ను ఆహ్వానించారని తెలుస్తోంది. ఇద్దరు డైరక్టర్లతో ఈ చిత్రం ఆడియోను లాంఛ్ చేయించబోతున్నారని ఇదివరకే చెప్పుకున్నాం. మహేశ్ బాబు కోసం రాజమౌళి .. లైకా ప్రొడక్షన్స్ వారితో గల అనుబంధం(2.0 నిర్మాతలు కూడా వాళ్లే) కారణంగా శంకర్ ఈ ఫంక్షన్ కి వెళ్లడానికి అంగీకరించారంట. తెలుగు ప్రేక్షకుల కోసం హైదరాబాద్ లోను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే.

Rajamouli and Shankar for SPYder Audio


లీకేజీ వార్తలపై మేకర్లు...

చిత్రంలోని కొన్ని సన్నివేశాలతోపాటు సాంగ్ కూడా లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. ఆ వార్తలంతా రూమర్లేనని కొట్టి పడేసింది. చిత్రంపై వస్తున్న లీకేజీ వార్తలు అవాస్తవం. చాలా పక్కగా పనులు జరుగుతున్నాయి అని లైకా సంస్థ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో తెలిపింది.

సెప్టెంబర్ 27న స్పైడర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Manchu manoj tweet on mega hero

  మెగా హీరోపై మంచు మనోజ్ ట్వీట్

  Nov 23 | మెగా-మంచు ఫ్యామిలీల మధ్య కొంత కాలం క్రితం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. పైకి నవ్వుతూ మాట్లాడుతూనే సెటైర్లు వేసుకోవటం ఆయా హీరోలకు అలవాటే. వజ్రోత్సవాలు వేదికగా.. చిరు-మోహన్ బాబు స్పీచ్ లు... Read more

 • Prakash raj legal notices to bjp mp

  బీజేపీ ఎంపీకి ప్రకాశ్ రాజ్ లీగల్ నోటీసులు

  Nov 23 | అవకాశం దొరికిన‌ప్పుడ‌ల్లా కేంద్ర ప్ర‌భుత్వంపై న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి రానంటూనే.. కన్నడ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై... Read more

 • Akkineni book not launched by pawan

  మన అక్కినేని పవన్ లాంఛ్ చేయలేదంట!

  Nov 23 | నిన్న టాలీవుడ్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ప్రముఖ రచయిత సంజయ్ కిషోర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత కోణంలోని పలు అంశాలను సేకరించి మన అక్కినేని పేరిట ఓ పుస్తకం రాశారు.... Read more

 • Bunny replaces ntr project

  ఎన్టీఆర్ ఎగ్జిట్.. బన్నీతో కొరటాల ఫిక్స్

  Nov 23 | హ్యాట్రిక్ దరశకుడు కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తోనే ఓ చిత్రం ఉండబోతుందని ఆ మధ్య... Read more

 • Amala paul cheating puducherry transport dept

  అమలాపాల్ కారు మోసం ఎంతలా అంటే...

  Nov 23 | నటి అమలాపాల్ కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం కొన్నాళ్ల క్రితం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆ వ్యవహారంలో జోక్యం కల్పించుకుని విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. ఆ తర్వాత... Read more

Today on Telugu Wishesh