Shraavya Reddy Comments on Arjun Reddy Movie

Shraavya reddy on arjun reddy

Shraavya Reddy, Arjun Reddy Movie, Vijay Devarakonda, Shalini Pandey, Vanga Sandeep Reddy

Actress Shraavya Reddy Shocking Comments on Arjun Reddy Movie. Why it should titled as Arjun Reddy even he is not Reddy in this movie instead of Deshmukh. And Shraavya also comments on Heroine Shalini Pandey.

అర్జున్ రెడ్డి పై శ్రావ్యా రెడ్డి ఫైర్

Posted: 09/06/2017 04:14 PM IST
Shraavya reddy on arjun reddy

విమర్శల నడుమే అర్జున్ రెడ్డి సినిమాకు విపరీతమైన హైప్, వసూళ్లు వచ్చేస్తున్నాయి. తొలివారంలో 30 కోట్లు వసూల్ చేసిన ఈ చిత్రం అదే స్పీడ్ తో దూసుకుపోతుంది. పైసా వసూల్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవటంతో అర్జున్ రెడ్డి థియేటర్లలో సేఫ్ గా రన్ అవుతూనే ఉన్నాడు. ఈ నెల చివరి కల్లా పెద్ద చిత్రాలు వస్తుండటంతో అప్పటిదాకా ఈ వివాదాల చిత్రమే రన్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే సినిమాపై ఓవైపు బడా బడా హీరోలు, మేకర్లు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరో పక్క వీహెచ్, అనసూయ లాంటి వాళ్లు మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ‘చిన్న’ నటి కూడా ఈ చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రావ్యరెడ్డి 'అర్జున్‌ రెడ్డి'పై ఫైర్ అయ్యింది.

తనకు చాలా తక్కువ సందర్భాలలోనే తలనొప్పి వస్తుందని, అలా తనకు తలనొప్పి తెప్పించిన సినిమాల్లో ‘అర్జున్‌ రెడ్డి’ ఒకటని మొదలుపెట్టి ఫేస్ బుక్ లో ఓ పోస్టును ఉంచింది. ‘‘అర్జున్‌ రెడ్డి చిత్రంలో హీరో పేరు 'అర్జున్ దేశ్ ముఖ్' కానీ, అర్జున్ కుటుంబం రెడ్డి కాదని.. దేశ్‌ ముఖ్‌ లని తెలిపింది. దేశ్‌ ముఖ్ స్థానంలో రెడ్డి అని ఎలా పెడతారని ప్రశ్నించింది. అలాగయితే సినిమాకు అర్జున్ దేశ్ ముఖ్ రెడ్డి పెట్టాలంటూ ఎద్దేవా చేసింది.

ఇక చిత్ర యాక్ట్ చేసిన హీరోయిన్ షాలిని పాండేను వదల్లేదు. ఆ హీరోయిన్ ఫేస్ కు యుద్ధాలు చేసేంత సీన్ లేదని తేల్చేసింది(చిత్రంలోని ఓ డైలాగ్ ను ఉద్దేశించి...) చివరగా సినిమా ద్వారా ‘‘ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండీ డైరెక్టర్ గారు? లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ చేసుకోమనా?’’ అంటూ సందీప్‌ రెడ్డి వంగను శ్రావ్యారెడ్డి ప్రశ్నించింది. సోషల్ మీడియా కాంట్రవర్సీల ద్వారా పాపులర్ అయిన శ్రావ్య.. పూరీ-కళ్యాణ్‌ రామ్ ‘ఇజం’ లో ఓ చిన్న రోల్ చేసింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles