అర్జున్ రెడ్డిపై శామ్, రానా.. బాగా చేశావ్ బ్రదర్! | Rana Sabash Brother to Arjun Reddy.

Celebs praising arjun reddy movie

Rana Arjun Reddy, Rana KTR Samantha Arjun Reddy, Vijay Devarakonda Arjun Reddy, Vijay Devarakonda Rana, Rana Praise Vijay Devarakonda

Celebrities Pour Appreciations on Arjun Reddy. KTR, Rana and Samantha in this list.

అర్జున్ రెడ్డికి సెలబ్రిటీల ప్రశంసలు

Posted: 08/28/2017 04:49 PM IST
Celebs praising arjun reddy movie

బోల్డ్ చిత్ర ప్రచారంతో మొదలైన అర్జున్ రెడ్డి హవా కొనసాగుతూనే ఉంది. యూత్ చిత్రానికి తెగ నచ్చేయటంతో ఎగబడిపోతున్నారు. కేవలం రెండే రోజుల్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు రాబట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అల్రెడీ సండే షోల దగ్గర నుంచి లాభాల పంట మొదలైందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరికొన్ని ఏరియాల్లో స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు.

ఇక టాలీవుడ్ లో అర్జున్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా హీరో విజయ్ దేవరకొండపై నటుడు రానా ప్రశంసల జల్లు కురిపించాడు. నేడు అర్జున్ రెడ్డి సినిమాను వీక్షించిన రానా బాగుందంటూ ట్వీట్ చేశాడు. 'బాగా చేశావ్ బ్ర‌ద‌ర్' అని, ఇటువంటి పెర్ఫార్మెన్సే కొన‌సాగించాల‌ని రానా ట్వీట్ చేశాడు.

అర్జున్ రెడ్డి రివ్యూ

నేచుర‌ల్‌గా ఉంద‌ని, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని కొనియాడుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, సమంత, డైరక్టర్ వర్మ ఇలా అందరికీ సినిమా తెగ నచ్చేసింది. అయితే అడల్ట్ కంటెంట్ డోస్ కాస్త ఎక్కువగా ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం కరువైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Reddy Movie  Rana Daggubati  Vijay Devarakonda  

Other Articles