మహానుభావుడు టీజర్.. శర్వాకి కొత్త రోగం ఏంటంటే... | Mahanubhavudu suffers from obsessive compulsive disorder

Mahanubhavudu teaser released

Mahanubhavudu, Mahanubhavudu Movie Teaser, Mahanubhavudu New Teaser, Mahanubhavudu Sharwanand, Sharwanand New Disorder, Mahanubhavudu Teaser Out

Sharwanand-Maruti's 'Mahanubhavudu' is released. As revealed earlier, Sharwanand's character in the film suffers from OCD (obsessive compulsive disorder) and it's totally fun to watch him in that character.

మహానుభావుడు టీజర్ వచ్చేసింది

Posted: 08/24/2017 10:44 AM IST
Mahanubhavudu teaser released

వరుస సక్సెస్ లతో మినిమమ్ వసూళ్ల హీరోగా మారిపోయాడు శర్వానంద్. రాధ కాస్త నిరాశపరిచినప్పటికీ ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో మహానుభావుడిగా వచ్చేస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ ను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు.

టీజర్ విషయానికొస్తే... చాలా స్టైలిష్ గా చూపించాడు దర్శకుడు. ఇక అంతే స్టైలిష్ లుక్ తో కనిపించిన శర్వానంద్ కి టిపికల్ రోగాన్ని అంటగట్టాడు కూడా. అతి శుభ్రం అనే పాయింట్ మీద మహానుభావుడు తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి బ్రష్ ను శుభ్రం చేసుకునే శర్వా, గుళ్లోకి కూడా సాక్సులు వేసుకుని వెళ్లేంత శుభ్రం... చివరకు హీరోయిన్ కు ముద్దు పెట్టే సమయంలో ముఖం కడుకున్నావా? అనే రేంజ్ దాకా ఉంది.

 

ఇంతకు ముందు భలే భలే మగాడివోయ్ లో హీరో నానికి మతిమరుపు లాగే ఇక్కడ శర్వానంద్ కి ఓసీడీ(ఓబెసిసివ్ కంపల్సన్ డిజాస్టర్) కాన్సెప్ట్ ను చూపించాడు. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రెష్ గా ఉంది. టీజర్ ప్రామిసింగ్ గా ఉండటంతో అంచనాలు పెరిగిపోతుండగా దసరా బరిలో మహానుభావుడు రిలీజ్ కు రెడీ అయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharwanand  Mahanubhavudu  Teaser Review  

Other Articles