రజనీ రికార్డు అజిత్ వల్ల అవుతుందా? | Ajith Can Beat Rajinikanth’s Kabali Opening Collections

Grand openings confirmed for ajith s vivegam

Vivegam, Vivegam Review, Ajith Vivegam Review, Ajith Vivekam Review, Ajith Rajinikanth Opening Record, Rajinikanth Vivegam, Vivegama Movie, Ajith Vivegam Kabali Record, Kabali Vivegam

Thala Ajith's spy-thriller Vivegam expected to create box office history, set for a big release on August 24. Can Beat Rajinikanth’s Kabali Opening Collections, Lets See.

తమిళనాట వివేగమ్ కొత్త రికార్డు

Posted: 08/23/2017 03:18 PM IST
Grand openings confirmed for ajith s vivegam

తమిళనాట గుట్టుచప్పుడు కాకుండా తన ఇమేజ్ ను పెంచేసుకుంటూ పోతున్నాడు తలా అజిత్. రేపు విడుదల కాబోతున్న వివేకం సినిమాకు ఇక్కడ తెలుగులో, మాతృక వివేగమ్ కూడా కూడా భారీ స్థాయిలో జరిగిన బిజినెస్ చూస్తే అర్థమైపోతుంది. వేదాలం వచ్చి రెండేళ్లు గడుస్తుండటంతో ఫ్యాన్స్ కూడా మాంచి కసి మీద ఉన్నారు.

అలా అని తన ఏ సినిమాకు కూడా అజిత్ ప్రమోషన్ చేసిన దాఖలాలు లేవు. బహుశా సౌత్ మొత్తం మీద ఇలా సైలెంట్ గా ఉండి వంద కోట్లు రాబడుతున్న ఏకైక వ్యక్తి తలానే కాబోలు. ఇదిలా ఉంటే మరో సెన్సేషన్ రికార్డును క్రియేట్ చేసి అజిత్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

వివేగమ్ కి కేవలం చెన్నైలోనే 500 స్క్రీన్లు కట్టబెట్టినట్లు సమాచారం. అంతేకాదు మాయాజల్ అనే మల్టీకాంప్లెక్స్ లో ఏకంగా 65 షోలు వేసేందుకు రంగం సిద్ధమైపోతుంది. బాహుబలి, రజనీ కబాలిలు కూడా ఈ ఫీట్ ను అందుకోలేకపోగా, అజిత్ క్రేజ్ మీదే సినిమాను ఆడించేయాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమైపోయారు. ఎటొచ్చి కబాలి రికార్డులను బ్రేక్ చేయాలన్నదే తలా ఫ్యాన్స్ ఇప్పుడు బలంగా కోరుకుంటున్నారు. కాజల్, అక్షర హసన్ హీరోయిన్లుగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్ పాత్రలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన వివేగమ్(వివేకం) ఆగష్టు 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith Kumar  Vivegam Movie  Kollywood News  Rajinikanth  Kabali Opening Collections  

Other Articles