హీరోయిన్ పై రేప్ అటెంప్ట్.. ఆ హీరోను తప్పించారా? | New Twist in Aspiring Telugu Actress Rape Attempt Case

Actress allegations on rape attempt case

Telugu Actress Rape Attempt Case, Actress Rape Attempt Case, Hero Srujan Arrest, Appudu Ippudu Movie Actress, Apudu Ipudu Actress, Actress Rape Attempt Case

Rape Attempt On Appudu Ippudu Actress. Actress Alleges that Police Didin't Arrest Hero Srujan. But Police denied that They Arrested Chalapathi and Srujan produced in Court follows they remanded 14 Days Custody.

లైంగిక వేధింపుల కేసు. హీరోయిన్ సంచలన ఆరోపణలు

Posted: 08/21/2017 10:36 AM IST
Actress allegations on rape attempt case

సినిమా ఛాన్సుల పేరుతో ఓ సీరియల్ నటిని హీరోయిన్ చేస్తామంటూ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గుర్తుంది కదా. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది.

అయితే బాధితురాలు ఇప్పుడు సంచలన ఆరోపణలే చేసింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విజయవాడ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ తెలిపింది. తనపై అసభ్యంగా ప్రవర్తించిన సృజన్ ను వదిలేసి, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారని ఆరోపించింది. ఈ కేసు నుంచి సృజన్ ను తప్పించేందుకు అరెస్ట్ చేసిన వ్యక్తికి ముసుగు కట్టి జైలుకు తరలించారని అంటోంది.

 

సృజన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె వాపోయింది. డబ్బుల కోసమే కేసు పెట్టిందంటూ సృజన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను బాధితురాలు ఖండించింది. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ మీడియాకు ఈ సందర్భంగా ఆమె కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Actress Rape Attempt Case  Director and Hero  

Other Articles