వీఐపీ వైఫ్ సైలెంట్ ఎందుకయ్యింది? | VIP Wife Don't Like Hit Sequel

Dhanush wife vip 2 success silent

Dhanush VIP2, Dhanush Wife Disappoint VIP 2, Aishwarya Dhanush Kollywood Gossips, Dhanush New Movie, Aishwarya Dhanush Movie

Dhanush Wife Aishwarya no feed back on VIP 2 Success. Rift between Dhanush and Aishwarya Rumour Surrounded.

ధనుష్ వైఫ్ కి ప్రాబ్లమేంటి?

Posted: 08/19/2017 05:03 PM IST
Dhanush wife vip 2 success silent

కోలీవుడ్ లో ధనుష్ వీఐపీ 2 హవా కొనసాగుతోంది. పెద్ద సినిమాలేవీ లేకపోవటంతో యావరేజ్ టాక్ వచ్చిన సినిమా కలెక్షన్లు కుమ్ముకుంటోంది. మొదటి వారంలో 25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఈ వారం అదే దూకుడు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ లతో, ఇంటర్వ్యూలతో ధనుష్ సందడి చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ఓ ఫీడ్ బ్యాక్ మాత్రం ఇంకా రాకపోవటం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

నిర్మాణ సమయంలో ఉండగా ఈ సినిమా గురించి ధనుష్ భార్య, సౌందర్య సోదరి ఐశ్వర్య తెగ మాట్లాడేసింది. అయితే, ఈనెల 11వ తేదీన ఈ సినిమా తమిళనాట విడుదలై .. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఐశ్వర్య ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా గురించి ఆమె ట్విట్టర్ లో కూడా ప్రస్తావించకపోవడం అయోమయానికి గురిచేస్తోంది.

రజనీ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆమెకి నచ్చలేదా? లేదంటే ఆమె సైలైంట్ అయిపోవడం వెనుక మరేదైనా కారణముందా? అనేది నెటిజన్ల మధ్య చర్చకు తెరతీసింది. సూపర్ స్టార్ ఫ్యామిలీలో తరచూ ఇలాంటి మనస్పర్థలు రావటం, వాటి గురించి ఫ్యాన్స్ తెగ చర్చించుకోవటం అక్కడ పరిపాటిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VIP 2  Dhanush  Aishwarya Dhanush  

Other Articles