Venue of Samantha's wedding with Naga Chaitanya చైతు సామ్ ల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదేనా..?

Wedding cards of naga chaitanya samantha goes viral in social media

samantha, naga chaitanya, naga chaitanya samantha wedding, chaitu sam wedding, chay sam wedding, chay sam october 6, sam and chai, sam chai wedding, sam chai knots, bride and bridegroom, social media, naga chaitanya yuddam sharanam, naga chaitanya rakshabandhan, naga chaitanya films, naga chaitanya samantha ruth prabhu, naga chaitanya wedding, tollywood

The happening star couple Samantha and Naga Chaitanya will be entering wedlock on October 6, 2017 in Goa. Samantha has said that the wedding will be a simple affair attended by family and close friends

చైతు-సామ్ లు మళ్లీ నెట్ లో వైరల్..

Posted: 08/10/2017 01:41 PM IST
Wedding cards of naga chaitanya samantha goes viral in social media

అక్కినేని నటవారసుడు.. అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల పెళ్లి అక్టోబ‌ర్‌లో గోవాలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న విషయం అభిమానులకు తెలిసిందే. ఈ పెళ్లి సాదాసీదాగా సాగుతుందని ఎలాంటి హంగుఅర్భాలు లేకుండా కేవలం వధువరుల బంధువులు, అప్తమిత్రుల మధ్య మాత్రమే జరుగుతుందని నటి సమంత ఇప్పటికే చెప్పేశారు. అయితే ఈ నేప‌థ్యంలో కాబోయే వధూవరులు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. అయితే ఇందుకు వారి ప్రమేయం ఏమీ లేకపోవడం గమనార్హం.

అయితే ఇందుకు కారణమైంది మాత్రం వారి వివాహ అహ్వాన ప‌త్రిక. ఈ అహ్వాన పత్రికకు సంబంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అక్టోబరు 6,7 తేదీలలో గోవాలో జరగనున్న సమంత, నాగ చైతన్యల పెళ్లికి రావాలని కోరుతూ అందులో అతిథ్యమిచ్చే వారి పేర్లు కూడా వున్నాయి. ఇది వరుడి తరపు నుంచి వచ్చిన వివాహ అహ్వాన పత్రిక అని కూడా స్పష్టమవుతుంది. అందుకు అతిధులను అహ్వానిస్తున్న వారుగా అక్కినేని నాగార్జున, అమల పేర్లతో పాటు లక్ష్మీ, శరత్ ల పేర్లు కూడా రాయబడి వున్నాయి.

అహ్వాన పత్రికలో ముందుగా, అక్కినేని అన్నపూర్ణ, అక్కినేని నాగేశ్వర రావు దివ్యాశీస్సులతో దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దివ్యాశీర్వచనాలతో నాగ‌చైత‌న్య, స‌మంత‌లు అక్టోబ‌ర్ 6న ఒక్క‌టి కానున్నార‌ని ఉంది. అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలోని వివాహ వేదికకు వచ్చి.. నైనెట్టీ, జోసఫ్ ప్రభుల కుమార్తె సమంతతో జరుగు తమ అబ్యాయి వివాహమహోత్సవానికి హాజరు కాగలరని అశీస్తున్నామని నాగార్జున అమల, లక్ష్మీ శరత్ దంపతులు అహ్వానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  samantha  wedding  invitation cards  tollywood  entertainment  

Other Articles