Spyder teaser pits Mahesh Babu’s intelligence officer గంటల వ్యవధిలో లక్షల మందిని భయపెట్టిన స్పైడర్

Spyder teaser pits mahesh babu s intelligence officer

spyder teaser, spyder trailer, spyder movie, SPYDER, mahesh babu spyder teaser, mahesh babu spyder, spyder telugu teaser, spyder official teaser, mahesh babu, spyder, rakul preet singh, murugadoss, tollywood, entertainment

On the occasion of Mahesh Babu’s 41st birthday, the teaser of his highly anticipated upcoming spy thriller Spyder was released

గంటల వ్యవధిలో లక్షల మందిని భయపెట్టిన స్పైడర్

Posted: 08/09/2017 02:54 PM IST
Spyder teaser pits mahesh babu s intelligence officer

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు కానుక ఇస్తూనే భయపెట్టడం తమకూ వచ్చునంటూ హెచ్చరికలు చేశారు. అదేంటి అంటారా..? ఇవాళ మహేశ్ బాబు 41వ జన్మదినం.. దానిని పురస్కరించుకుని మురగదాస్ దర్శకత్వంలో రూపోందుతున్న మహేశ్ తాజా చిత్రం స్పైడర్ టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. గంటల వ్యవధిలోనే 17 లక్షల మంది ఈ టీజర్ ను వీక్షించారు. మహేశ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ విడుదల కావడంతోనే అంతర్జాలంలో ఈ టీజర్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మురుగదాస్ తన దర్శకత్వం రూపోందుతున్న చిత్రం టీజర్ కు అభిమానుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బ్లాక్ బస్టర్ ఆన్ ది వే అంటూ మురుగదాస్ చెప్పిన మాట నిజం కాబోతోందంటూ టీజర్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  'పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ చేసేందుకు... గ‌వ‌ర్న్‌మెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని విలన్ ఎస్ జే సూర్య చెప్పడం, 'భయపెట్టడం మాకూ తెలుసు' అన్న మహేశ్ డైలాగు, 'ఐ నీడ్ ఏ బ్లైండ్ డేట్' అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ డైలాగులు ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి.

తెలుగుతో పాటు తమిళ టీజర్ కూడా నెట్ లో హల్ ‌చల్ చేస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఎన్వీఆర్ సినిమా ఎల్ఎల్పీ, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ కూడా సహనిర్మాణంలో పాల్గోంటున్నాయి. మరెందుకు అలస్యం మీరూ ఈ టీజర్ ను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  spyder  rakul preet singh  murugadoss  tollywood  

Other Articles