సెన్సార్ సంగతి అసలు మీకేందుకంటూ ఫైర్ | Perfect Actor Soft Warn to Censor Board

Aamir khan fire on censor board

Aamir Khan, Aamir Khan CBFC, Aamir Khan Censor Board, Shyam Benegal CBFC, Shyam Benegal Proposals, Shyam Benegal Instructions, Shyam Benegal Aamir Khan, Shyam Benegal Aamir, Aamir Shyam Benegal, Shyam Benegal Pahlaj Nihalani, Aamir Khan Pahlaj Nihalani, Aamir Khan Babumoshai Bandookbaaz, Aamir Warn CBFC, Aamir Khan Secret Superstar Trailer Launch

Aamir Khan's Polite Reminder To CBFC Don't Censor But Certify. Aamir was speaking at the trailer launch event of his new project Secret Superstar on Wednesday afternoon.

సెన్సార్ బోర్డుపై అమీర్ ఫైర్

Posted: 08/04/2017 01:05 PM IST
Aamir khan fire on censor board

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) బాలీవుడ్ చిత్రాల విషయంలో అతి జోక్యంతో తీవ్ర విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పహ్లాజ్ నిహలానీ చైర్మన్ అయ్యాక అగ్రశ్రేణి హీరోల చిత్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. సెన్సార్ పేరితో సినిమాకు కీలకమైన సన్నివేశాలను కత్తెరలు వేయటం, వాటిపై కొందరు పోరాటాలు చేస్తుంటే.. మరికొందరు గప్ చుప్ గా ఉండిపోతున్నారు.

రీసెంట్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘బాబుమోషాయ్ బందూక్‌బాజ్’ సినిమాలో సెన్సార్ బోర్డు ఏకంగా 48 కట్‌లు చెప్పడంతో బోర్డు తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ స్పందించాడు. తన చిత్రం(నిర్మాత) సీక్రెట్ సూపర్ స్టార్ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా సెన్సార్ బోర్డ్ కు సున్నితంగా ఓ వార్నింగ్ ఇచ్చేశాడు. బోర్డు తనపని తాను చేసుకుంటే మంచిదని సూచించాడు.

ముందు సెన్సార్ గురించి తనకు అవగాహన లేదని మొదలుపెట్టిన అమీర్. ఆపై డీప్ చర్చకు వెళ్లిపోయాడు. బోర్డు పని సర్టిఫికెట్ ఇవ్వటం మాత్రమేనని గుర్తు చేస్తూ.. సెన్సార్ సంగతిని తమకు వదిలేయాలంటూ వ్యాఖ్యానించాడు. ‘‘నాకు తెలిసినంత వరకు సినిమాలకు గ్రేడ్ ఇవ్వడమే దాని విధి అని స్పష్టం చేశాడు. గతంలో శ్యామ్‌బెనగల్ ప్రతిపాదనలు కూడా ఆ విషయాన్నే చెబుతున్నాయని గుర్తుచేశాడు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని ఆమీర్ వ్యక్తం చేశాడు. ఓ చిన్నపట్టణంలో గ్యాంగ్‌స్టర్ పై తెరకెక్కిన బాబుమోషాయ్... కథ విషయంలో సీబీఎఫ్‌సీ వ్యవహరించిన తీరును బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pahlaj Nihalani  CBFC  Babumoshai Bandookbaaz  Aamir Khan  

Other Articles