పైసా వసూల్ స్టంపర్.. బాలయ్య క్రష్ ఎవ్రీ వన్.. | Balayya Crush Every One with Paisa Vasool Stumper

Paisa vasool stumper released

Balayya Teaser, Paisa Vasool Teaser Review, Balayya Crush Every One, Paisa Vasool Stumper, Paisa Vasool Teaser Review, Paisa Vasool Stumper Review, Paisa Vasool Stylish Balayya, Paisa Vasool Stumper Action Film, Paisa Vasool Teaser Talk, Crush Every One Dialogue, Paisa Vasool Stumper 101

Nanadamuri Balakrishna 101 movie Paisa Vasool Official Teaser Released. The Stumper reveals NBK’s Stylish Attitude with action mode.

పైసా వసూల్ స్టంపర్ రిలీజ్.. యాక్షన్ ఫిల్మ్

Posted: 07/28/2017 10:40 AM IST
Paisa vasool stumper released

అమితాబ్ లాంటి సీనియర్ హీరోను కూడా చాలా స్టైలిష్ అండ్ రఫ్ గాయిస్ గా చూపించే పూరీ నటసింహ బాలయ్య ను ఎలా చూపించబోతున్నాడోనని వెయిట్ చేసిన అభిమానుల దాహం తీరిపోయింది. 101వ మూవీ పైసా వసూల్ టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. టీజర్ కా బాప్.. ట్రైలర్ కా బేటా అంటూ స్టంపర్ పేరుతో విడుదల చేయగా, యూట్యూబ్ లో ట్రెండ్ అయిపోతుంది.

ఇక టీజర్ విషయానికొస్తే... ‘‘అన్నా... రెండు బాల్కనీ టికెట్లు కావాలి... అని ఫుల్ గా మందు కొట్టిన బాలయ్య డైలాగ్ వదిలాడు. ఆ.. ఇది సినిమా కాదు వాయ్... అని విలన్ వేసిన కౌంటర్ కు, సినిమా కాకపోతే ఇంకేంటి... ఐయామ్ ది హీరో, యువార్ ది కమేడియన్... విలన్ టచ్డ్ మై హీరోయిన్... దిస్ ఈజ్ యాన్ యాక్షన్ ఫిలిం' అంటూ బాలయ్య చెప్పిన డైలాగు అదిరిపోయింది. ఇందులో బాలయ్య గతంలో ఎన్నడూ లేనంత ఎనర్జిటిక్ గా కనిపిస్తుండటం ఫ్యాన్స్ ను అమితానందంలోకి నెట్టేస్తోంది.

 

ఇక మధ్యలో ఎన్టీఆర్ స్టెప్పులతోనూ అలరించిన బాలయ్యను చూడొచ్చు. అనూప్ బ్యాగ్రౌండ్ సాదాసీదాగానే ఉండగా, విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. అయితే పంచ్ డైలాగుల బాలయ్య వాయిస్ లో మాత్రం కాస్త తేడా కొడుతుందనే చెప్పాలి. 'తమ్ముడూ, నేను జంగిల్ బుక్ సినిమా చూడలా... కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి' అన్న మరో డైలాగ్... మందేసిన మదపు టేనుగు రా.. క్రష్ ఎవ్రీ వన్ అంటూ డైలాగుతో ముగించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Paisa Vasool Stumper  Teaser Review  

Other Articles