ఛార్మీ కన్నా ముమైత్ ఖానే ఇంపార్టెంట్ | Mumaith Khan Plays Key Role in Drug Probe

Mumaith khan appears before sit in drug case

Mumaith Khan, Mumaith Khan SIT Probe, Mumaith Khan Narcotic Case, Tollywood Narcotic Case, Tollywood Drug Case, Drug Case Mumaith Khan, Mumaith Khan Inquiry, Mumaith Khan Tollywood, Mumaith Khan SIT Probe

Tollywood Drug Case SIT Officials interrogate actress Mumaith Khan properly. SIT Officials believed that She was actually in bigg boss house while SIT serve notices. And also she didn't Know anything about SIT Probe.

ముమైత్ ఖాన్ తో సిట్ సిట్టింగ్.. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి?

Posted: 07/27/2017 11:45 AM IST
Mumaith khan appears before sit in drug case

టాలీవుడ్ తోపాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో 8వ రోజు విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరయ్యింది. నేరుగా పుణేలోని బిగ్ బాస్ హౌజ్ సెట్స్ నుంచి ఓ ప్రతినిధి వెంటరాగా నిన్న రాత్రే హైదరాబాద్ కు చేరుకుంది. ఈ ఉదయం సిట్ ఆఫీస్ కు చేరుకున్న ముమైత్ ఖాన్ ను చాలా కీలకమైన వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

డ్రగ్స్ ఆరోపణలు, సిట్ నోటీసులు అందుకున్న సమయానికే ఆమె బిగ్ హౌస్ లోకి చేరిపోయింది. హౌస్ లో ఉన్నవాళ్లు ఫోన్లు, ఇంటర్నెట్ నిషేధం, ఇతరులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కుంటు సిట్ విచారణకు హాజరైన వారి మధ్య ఒకరికొకరికి విచారణకు సంబంధించి రాయబారాలు నడిచే అవకాశం ఉండగా, ఈ ఐటెం భామకు మాత్రం ఆ ఛాన్స్ లేనే లేదు. దీంతో సిట్ దర్యాప్తు ఏ రేంజ్ లో జరుగుతుందో ఆమెకు తెలిసే అవకాశాలే లేవు. సో.. ఈ లెక్కన ముమైత్ లోతుగా విచారించి నుంచి బోలెడు వివరాలు రాబట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

పూరీ డ్రగ్స్ వ్యవహారం, పార్టీల్లో ముమైత్ పాల్గొనడం వంటి విషయాలపైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కెల్విన్ తో డైరక్ట్ లింక్స్ కు సంబంధించి ఆధారాలు లేనప్పటికీ, డ్రగ్స్ వాడకం, మరెవరికైనా సరఫరా చేయటం వంటి అనుమానాలతో ఆమెను విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలు రాబట్టే యత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumaith Khan  SIT Probe  Narcotic Case  

Other Articles