సిట్ అధికారులనే ఆటాడుకుందంట! | Charmi Reveal Nothing in SIT's Inquiry

Sit failed in probe of charmi

Charmi Kaur, Charmi SIT Probe, Charmi Reveal SIT Probe, Charmi Kelvin Relation, Charmi Puri Drugs Habit, Charmi Puri Break Up, Charmi SIT Officials, Charmi Game with SIT, Charmi SIT Failure

Actress Charmi Kaur reveal nothing in SIT probe over Drugs Case. She argues with officials on some questions that those are her personal,

సిట్ విచారణలో ఛార్మీ ఏం చెప్పిందంటే...

Posted: 07/27/2017 09:21 AM IST
Sit failed in probe of charmi

మాదకద్రవ్యాల కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటి ఛార్మి సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మరీ ఎక్సైజ్ శాఖ నుంచి కొన్ని మినహాయింపులు పొంది మరీ హైలెట్ అయ్యింది. అయితే, ఇప్పటి వరకు పలువురిని తాము అనుకున్న విధంగానే విచారించి సక్సెస్ అయిన సిట్ అధికారులకు ఛార్మీ వ్యవహారం మాత్రం కాస్త నిరాశకే గురిచేసిందని తెలుస్తోంది.

విచారణ సమయంలో ప్రతి ప్రశ్నకు తెలియదు, లేదు అంటూ సమాధానాలిచ్చినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు సమాధానంగా 'నా పర్సనల్ విషయాలు మీకెందుకు' అంటూ ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కెల్విన్ తో పరిచయం ఉందా అని ప్రశ్నిస్తే... అతనెవరో తనకు తెలియదని, అతని ఫోన్ లో తన నెంబర్ లేదంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చిందంట. ఇక పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు మీరెప్పుడైనా చూశారా అనే ప్రశ్నకు లేదు అని సమాధానం చెప్పింది. ఇలా దాదాపు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదనే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో, కీలకంగా భావించిన ఛార్మీ నుంచి సరైన సమాధానాలు రాబట్టడంలో సిట్ విఫలమైందనే చెప్పొచ్చు. ఇక ముందుగా ఊహించినట్లే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరిస్తామని అధికారులు కోరగా... అందుకు ఆమె నిరాకరించింది. మరోపక్క మహిళా అధికారులు ప్రశ్నించటంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmi  Drugs Case  SIT Probe  

Other Articles