200 కోట్ల స్పైడర్ బిజినెస్.. రియాల్టీ ఏంటంటే... | 200 Crores Pre Release Business for Mahesh Movie

Mahesh spyder pre release business

Mahesh Babu, Mahesh Babu Spyder, Spyder Pre Release Business, Spyder Business, Spyder Movie Business, Baahubali 2 Spyder, Spyder Shocking Business, Spyder Business Details

Mahesh Babu's 'Spyder' is all set to ring in a new record after Baabubali 2, in terms of pre-release business among Telugu movies with 200 crores. Although the makers have not sold off all territories in Andhra Pradesh, they are confident of closing the business to the tune of Rs 90 Cr for the Telugu version.

స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ షాకిస్తోందిగా...

Posted: 07/26/2017 04:05 PM IST
Mahesh spyder pre release business

పక్కనే ఉన్న కోలీవుడ్ సినిమాలు అలవోకగా వంద కోట్ల బిజినెస్ లు చేస్తుంటే.. బాలీవుడ్ తర్వాత పేరున్న మన సినిమా మాత్రం ఆ ఫీట్ కోసం ఎంత కష్టపడ్డా వర్కవుట్ అయ్యేది కాదు. ఇది రెండేళ్ల క్రితం పరిస్థితి. కానీ, బాహుబలి రాకతో టాలీవుడ్ కలెక్షన్ల ముఖచిత్రమే మారిపోయింది. శ్రీమంతుడు, ఖైదీ నంబర్ 150 లాంటి చిత్రాలు కలెక్షన్లు కుమ్ముకోగా, బ్లాక్ బస్టర్ పేరిట వంద కోట్ల (గ్రాస్) కలెక్షన్లు సాధిస్తుంటే.. యావరేజ్ టాక్, ఫ్లాప్ టాక్ సినిమాలు కూడా 50 కోట్ల క్లబ్ లో అలవోకగా చేరిపోతున్నాయి.

అలాంటి తెలుగు సినిమా ఇప్పుడు 200 కోట్ల మార్క్ ను చేరుకోబోతుందన్న ఓ వార్త ఎగ్జయిటింగ్ కలిగిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' దీనికి రీజన్ కాబోతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్ల వరకూ తెచ్చిపెడుతుండగా .. తమిళ వెర్షన్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ వారు 23 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఇక హిందీ .. మలయాళ వెర్షన్స్ కి సంబంధించిన హక్కులు 25 కోట్లవరకూ పోయే అవకాశాలు వున్నాయట. అన్ని భాషలకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ 26 కోట్లవరకూ వచ్చాయని అంటున్నారు.

ప్రస్తుతానికి 170 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం మున్ముందు జరిగే పరిణామాలతో డబుల్ సెంచరీ ఫీట్ ను సాధించే ఛాన్స్ క్లియర్ గా ఉన్నాయి. మహేష్ క్రేజ్ తోపాటు మురగదాస్ పేరు కూడా సినిమా ఈ రేంజ్ బిజినెస్ చేసేందుకు కారణమైందని చెప్పొచ్చు. మొత్తానికి రిలీజ్ కు ముందే నిర్మాతలు సుమారు 50 నుంచి 60 కోట్లు లాభాలు సంపాదించేసుకోగా, ఇక కలెక్షన్లను రాబట్టాల్సిన బాధ్యతే ఆ ఇద్దరిపైనే ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Pre Release Business  

Other Articles