బిగ్ బాస్ తో హాటీకి బిగ్ టర్న్ | Bigg Boss turns that struggle Actress Fate

Star heroes que for bigg boss girl

Actress Oviya, Oviya Bigg Boss, Bigg Boss Turns Her Fate, Bigg Boss Big Opportunities, Oviya Vijay Sethupathi, Oviya Telugu Movie, Oviya Movies, Oviya Craze

Actress Oviya gets more craze with Tamil Bigg Boss Show. she has become a favorite contestant among the audience, ‘Oviya’s army’ and ‘Oviyans’ have gone crazy on Twitter in her support.

బిగ్ బాస్ బ్యూటీకి బంఫరాఫర్

Posted: 07/26/2017 02:31 PM IST
Star heroes que for bigg boss girl

కాంట్రవర్సీలతో క్రేజ్ పెరుగుతుందే తప్ప.. ఏ మాత్రం తగ్గదని ప్రత్యక్షంగా నిరూపిస్తోంది నటి ఓవియా. తమిళ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఫేట్ ఇప్పుడు భయంకరంగా మారిపోయింది. ఆల్ మోస్ట్ హౌస్ లో డామినేషన్ అంతా ఈ అమ్మడిదే అంటే అతిశయోక్తి కాదు. నమిత లాంటి పవర్ ఫుల్ లేడీని ఎలిమినేట్ చేసింది ఓవియా. ఇంతకీ ఆమె గతం ఏంటి?

2007 లో మళయాళంలో కంగారు మూవీతో ఆరంగ్రేటం చేసిన ఓవియా మూడేళ్లకు గానీ హీరోయిన్ గా ప్రమోషన్ పొందలేదు. డెబ్యూ కళావనీతో ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ అయ్యింది. ఆపై ఓ పాతిక చిత్రాలు చేసినప్పటికీ అవేం పెద్దగా పేరును తెచ్చిపెట్టలేదు. కానీ, బిగ్ బాస్ తో ఈ హాట్ బ్యూటీకి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఆమె ఇప్పుడు అక్కడ ఫేవరెట్. అంతేకాదు సోషల్ మీడియాలో ఓవియా ఆర్మీ పేరుతో యాష్ ట్యాగ్ నడుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక షో ఎప్పుడు అయిపోతుందా? ఆమెతో ఎప్పుడు సినిమానా? అన్న ఎగ్జయిటింగ్ లో మేకర్లు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ సేతుపతి పక్కన్న అల్రెడీ ఓ సినిమా ఓకే అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే చాలా గ్యాప్ తీసుకుని టాలీవుడ్ లో తరుణ్ చేస్తున్న సినిమా 'ఇది నా లవ్ స్టోరీ' లో ఓవియానే హీరోయిన్ కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Oviya  Bigg Boss Show  Movie Offers  

Other Articles