Natural Star Team Up with Nandamuri Banner

Nani in nandamuri banner

Natural Star Nandamuri Hero, Nani NTR Banner, Nandamuri Banner, Nani New Movie, Hero Nani New Movie, Nani New Projects, Nani New Movie Nandamuri, Nani Nandanuri Dealing

Natural Star Nani will soon be doing a film for NTR Arts Banner. He has okayed this film for Kalyan Ram. Presently Kalyan Ram is busy with 'Jai Lava Kusa' starring NTR Jr. Now it remains to be seen with which director he will be working for Kalyan Ram's production.

నందమూరి బ్యానర్ లో నేచురల్ స్టార్ ?

Posted: 07/25/2017 04:49 PM IST
Nani in nandamuri banner

నాని కెరీర్ టాలీవుడ్ లో మరీ ఇంతగా టర్న్ అవుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో. ఏ హీరోకు కూడా సాధ్యం కానీ రీతిలో వరుసగా ఏడు హిట్లు కొట్టి మాంచి ఊపు మీద ఉన్నాడు. అయితే ఆ హుషార్ లో తన వేగాన్ని మాత్రం ఆపటం లేదు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇది సెట్స్ మీద ఉండగానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం'కి సిద్ధమవుతున్నాడు. సీనియర్ నాగ్ కూడా ఇందులో ఓ కీలకపాత్ర పోషించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ బ్యానర్ లో నాని ఓ మూవీ ఓకే చేశాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల తర్వాత కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే నానితో వెంటనే సినిమాను మొదలుపెట్టబోతున్నాడంట. ఈ సినిమాను ఓ క్రేజీ యంగ్ దర్శకుడు డీల్ చేసే ఛాన్స్ ఉందని చెబుతుండగా, పూర్తి వివరాలు త్వరలో తెలియజేసే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Natural Star  Actor Nani  NTR Arts Banner  

Other Articles