బాలయ్య బిజినెస్ మెన్ ఫ్లాన్ | Balayya Big Plan for Paisa Vasool Teaser

Paisa vasool teaser date fix

Paisa Vasool, Paisa Vasool Teaser, Paisa Vasool Teaser Date, Paisa Vasool Balayya, Paisa Vasool Pre Release Business, Paisa Vasool Puri Plan, Paisa Vasool New Movie, Paisa Vasool Teaser Review

Balayya Puri Paisa Vasool Teaser Date Fixed. Makers Expect Huge Offers for Paisa Vasool after Teaser Release.

పైసా వసూల్ టీజర్ డేట్ ఫిక్స్

Posted: 07/25/2017 02:55 PM IST
Paisa vasool teaser date fix

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో వచ్చే సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పూరీ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం 'పైసా వసూల్' కోసమే మనం చెప్పుకునేది. పైగా సినిమా ఫస్టు లుక్ వచ్చిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఆ అంచనాలు మరింత పెంచాలంటే సాధ్యమైనంత త్వరగా టీజర్ ను తెచ్చేందుకు టీమ్ రెడీ అవుతోంది.

జూలై 28 ఉదయం 10:10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలోని భారీతనం... మాస్ అంశాలు టీజర్ ద్వారా ఆవిష్కరించి, హైప్ పెరిగేలా ఫ్లాన్ చేసుకుంటున్నారంట. తద్వారా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేయాలన్నదే నిర్మాతల ఫ్లాన్. బాలయ్య కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతుండటమే కాదు, స్టైలిష్ గా కూడా రూపొందిస్తున్నారంట.

టెంపర్ తర్వాత వరుసగా జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్ ఇలా వరస డిజాస్టర్లతో పూరీ డీలా పడి ఉన్నాడు. ఈ నేపథ్యంలో పూరీకి బ్లాక్ బస్టర్ ఖచ్ఛితంగా అవసరం. అందుకే మేకింగ్ దగ్గరి నుంచి ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. శ్రీయా, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తుండగా, బాలయ్య ఓ పాట కూడా పాడాడు. దసరా సందర్భంగా పైసా వసూల్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paisa Vasool  Balakrishna  Teaser Date  

Other Articles