బ్లడ్ ఇవ్వను.. ఇదంతా కామన్.. వాళ్లు కూడా డగ్ర్స్ వాడుతున్నారుగా-నవదీప్? | Navadeep Confirmed Drug Usage in Tollywood

Navadeep reveal facts in sit probe

Actor Navadeep, Tollywood Actor Navadeep, Navadeep Drug Usage, Navadeep Drug Addict, Navadeep Kelvin, Navadeep Drug Peddler, Navadeep Reveal Drug Names, Navadeep SIT Probe, Navadeep Blood Sample

SIT questioned Actor Navadeep for more than 11 hours and reportedly extracted vital information from him.So many actors, actresses names he reveal in probe. At last twist of the day is that Navadeep reportedly refused to give his blood samples to investigation team as they asked him for tests which can deduct his drug usage, if he did.

డ్రగ్స్ విచారణలో నవదీప్ ఏం చెప్పాడంటే...

Posted: 07/25/2017 08:34 AM IST
Navadeep reveal facts in sit probe

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో కీలకంగా భావిస్తూ వస్తున్న యువనటుడు నవదీప్ నుంచి సిట్ కీలక సమాచారాన్నే రాబట్టినట్లు సమాచారం. విచారణలో నేరాన్ని అంగీకరించటంతోపాటు పలు సరికొత్త విషయాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టు, పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. సదరు డ్రగ్స్ ను పబ్బుల్లో విచ్చల విడిగా నవదీప్ వినియోగించినట్టు వెల్లడైంది.

ఇదిలా ఉంటే రక్తనమూనాను ఇచ్చేందుకు కూడా నవదీప్ ససేమిరా అన్నాడు. దీంతో ఉస్మానియా వైద్యులను సిట్ అధికారులు వెనక్కి పంపి, అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తామని చెప్పి 11 గంటల విచారణ అనంతరం పంపిచేశారు అధికారులు. అయితే విచారణ సందర్భంగా ఈ యువనటుడు వెల్లడించిన షాకింగ్ విషయాలు మీడియాలో వస్తుండటం పెను కలకలం రేపుతోంది. తాను డ్రగ్స్ ఎలా సరఫరా చేశానన్న విషయంతోపాటు, సినీ రంగంలో డ్రగ్స్ గుట్టుచప్పుడు కాకుండా ఎలా నడుస్తాయన్న విషయాన్ని పుస గుచ్చినట్లు నవదీప్ వివరించినట్లు సమాచారం.

కొందరు అగ్రహీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తనకు తెలుసని సిట్ విచారణలో నవదీప్ తెలిపాడు. అంతేకాదు, వాళ్ల పేర్లను నవదీప్ సిట్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో నవదీప్ సిట్ విచారణలో ఎవరి పేర్లు చెప్పాడు? ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో? సిట్ ఎవరికి సమన్లు పంపుతుందోనని టెన్షన్ టాలీవుడ్ లో పెరిగిపోతోంది. కాగా, హైదరాబాదులోని పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం సర్వసాధారణమని, వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయని నవదీప్ వెల్లడించినట్లు భోగట్టా. ఇదిలా ఉండగా ఛార్మి వేసిన పిటిషన్ నేడు కోర్టులో వాదనకు రానున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navadeep  Tollywood  Drug Mafia  SIT Probe  

Other Articles