నాతో ఎవరూ చేయకపోవటానికి కలరే కారణం | No Body Can Interested to Act with Me:Nawazuddin

Actor nawazuddin comments on his journey

Nawazuddin Siddiqui, Nawazuddin Siddiqui Racism, Nawazuddin Siddiqui 2500 Rupees, Actor Came with 2500, Nawazuddin Siddiqui Racism Tweet, Nawazuddin Siddiqui Racism, Nawazuddin Siddiqui Controversy

Nawazuddin Siddiqui Came to to Mumbai with Rs 2500. Ready to leave that amount only. Nawazuddin Siddiqui gets Bollywood's support in racism row

2,500 రూపాయలతో ఎలా వచ్చానో అలాగే పోతా...

Posted: 07/24/2017 12:07 PM IST
Actor nawazuddin comments on his journey

హర్డ్ వర్క్ నెవర్ ఫెయిల్యూస్ అన్నదానికి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా రుజువులే ఉన్నాయి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అతి కష్టం మీద స్టార్ స్టేటస్ కు చేరిన వారు ఎందరో. కేవలం తమ ప్రతిభతోనే వాళ్లు ఆ స్టేజీకి చేరుతున్నారనటంలో ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. అలాంటి వాళ్లలో ఒకడు నవాజుద్దీన్ సిద్దిఖీ. 'సర్ఫ్ రోష్'లో చిన్న పాత్రతో సినీ రంగప్రవేశం చేసిన సిద్ధిఖీ ఇప్పుడు విలక్షణ నటనకు కేరాఫ్ గా మారిపోయాడు. అలాంటిది తనతో నటించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటానికి జాతి వివక్షతే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం, దానికి పలువురు సపోర్ట్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాను ఇండస్ట్రీకి కేవలం ఓన్ టాలెంట్ మీదే వచ్చానని, ఏమైనా తేడాలు వస్తే ఎలా వచ్చానో అలానే వెళ్లిపోతానని అంటున్నాడు. సినిమాలపై ప్రేమతో 12 ఏళ్ల క్రితం 2,500 రూపాయలతో ముంబై చేరాను. మూడేళ్లు చాలా దుర్భర జీవితాన్నిగడిపాను. చేసేందుకు పని లేదు, అవకాశాలు అస్సలు లేవు. దీంతో పూటకో స్నేహితుడి ఇంట్లో భోజనం చేసేవాడిని. చాలా కష్టంగా అనిపించేంది. ఒకానోక టైంలో ముంబై వదిలి వెళ్లిపోవాలని అనుకున్నా. కానీ, మనసు మార్చుకుని మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టా అని వివరించాడు.

తన కష్టానికి తగ్గ ప్రతిఫలంగానే తాను స్టార్ డమ్ అనుభవిస్తున్నానని, మంచి రెమ్యూనరేషన్ తో లైఫ్ ముందుకు సాగుతుందని చెబుతున్నాడు. అయితే ఇంత జరిగినా తన వే ఆఫ్ లైఫ్ మాత్రం మారబోదని అంటున్నాడు. పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలీదు. అవసరమైతే తాను ఎలా వచ్చానో అలాగే వెళ్లిపోవటానికి రెడీగా ఉన్నా. చివరి దశలో దుర్భర జీవితాన్ని గడిపిన నటుల కథలు నాకు తెలుసు. అందుకే అన్నింటికి సిద్ధంగా ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Nawazuddin Siddiqui  Racism Comments  

Other Articles