డ్రగ్స్ కేసు.. వర్మ సెంటిమెంట్ మెసేజ్.. కామెడీ | Maverick Director Full Support to Subba Raju And Puri

Varma support tweets in drug case

Ram Gopal Varma, RGV, Ram Gopal Varma Drug Scandal, Varma Drug Case, RGV Tollywood Drug Case, Ram Gopal Varma Akun Sabharwal, RGV Drug Case, RGV Disciples in Drug Case, Varma Facebook Messages, Chandravadan RGV

Ram Gopal Varma speaks up in support of Puri Jagannadh and Subbaraju in the Tollywood Drug Scandal. Varma Message to Akun Sabharwal and Media Don't have guts to show other names who involved in this Case. SIT Member Chandravadan counter to RGV.

డ్రగ్స్ కేసులో వాళ్లకు వర్మ ఫుల్ సపోర్ట్

Posted: 07/22/2017 01:22 PM IST
Varma support tweets in drug case

డ్రగ్ కలకలం లో కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలు బయటకు పొక్కటం, వాళ్ల విచారణ వేగవంతం అవుతుండటం, మరికొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు రావటం.. అందులో ఫ్లాఫ్ లతో సతమతమవుతున్న ఓ స్టార్ డైరక్టర్ కూడా ఉన్నాడంటూ పూరీ చెప్పాడన్న లీక్ లు అందటం, ఇలా సాగిపోతుంది. సాధారణంగా ఏ టాపిక్ పైన అయినా స్పందించే వివాదాల వర్మ దీనిపై రియాక్ట్ కావట్లేదనుకుంటున్న తరుణంలో వార్తల్లోకి వచ్చేశాడు.

టోటల్ సినీ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ రాత్రి నుంచి వరుసగా మెసేజ్ లు పెడుతున్నాడు. సినిమా వాళ్లను ట్రీట్ చేసినట్లుగానే.. స్కూల్ స్టూడెంట్లను 12 గంటలు విచారిస్తారా? తెర వెనుక ఉన్న వాస్తవాలు ఎవరి తెలుసో.. ఏమోగానీ, అకున్ ను అమరేంద్ర బాహుబలిలా ట్రీట్ చేస్తూ మీడియా కూడా పెద్ద హడావుడి చేసేస్తోంది. బహుశా రాజమౌళి బాహుబలి 3 అకున్ తోనే తీస్తాడేమో. ఇక్కడ నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. మీడియా కథనాలకు తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాలని వర్మ సూచించాడు. ఏ ఆధారాలు లేకుండా సినిమా వాళ్లను ఎలా అనుమానిస్తున్నారని ఆయన ప్రశ్నించాడు. ప్రజల మనసులు చెడిపోకముందే ఆయన స్పందించాలని సూచించాడు. కానీ, లీకుల ద్వారా సెలబ్రిటీల కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేయటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు.

ప్రతీ దానికి సినిమా వాళ్లు కావాలి అంటూ తన ఆస్థాన రైటర్ సిరాశ్రీ రాసిన ఓ గేయాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. వార్త ఎలాంటిదైనా.. చివరకు చస్తున్నారన్న సరే సినిమావాళ్లను వార్త కోసం వాడుకునే సంస్కృతి ఇప్పుడు నెలకొందని ఆ భావ గేయంలో వెల్లడించాడు. అయితే తన శిష్యుడు పూరీ కావటం, మిగతా వాళ్లలో కూడా తన దగ్గర పని చేసిన వాళ్లే ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వర్మ వండిన ఈ సెంటిమెంట్ సందేశాలు ఎంతవరకు జనాల్లోకి వెళ్లతాయనేది అనుమానమే.

వర్మకు ఇమిడియేట్ కౌంటర్...

మాదకద్రవ్యాలు సమాజానికి ఎంత హాని చేస్తున్నాయో మీకు తెలియడం లేదని అని వర్మకు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ కౌంటర్ వేశాడు. విచారణ వివరాలు బయటకు తెలియకుండా, సమాచారం బయటకు పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అయినా లీకులు రావటం సహజమేనని వ్యాఖ్యానించాడు. కొంత మంది (రాంగోపాల్ వర్మ) చిన్న పిల్లలను కూడా 12 గంటల పాటు విచారిస్తారా? అని ప్రశ్నిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. 

ఎవరిని ఎలా విచారించాలో వారిని అలాగే విచారిస్తామని, తామెవరికీ సర్టిఫికేట్లు ఇవ్వటం లేదని స్పష్టం చేశాడు. సినీ పరిశ్రమను తాము లక్ష్యం చేసుకోలేదన్న ఆయన, కేసును నీరుగార్చే ఉద్దేశ్యం తమకు ఏ మాత్రం లేదని తెలిపాడు. భారత్ లో ఎక్సైజ్ శాఖ ఉందని తనకు ఇప్పుడే తెలిసిందని, అసలు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందని ఎద్దేవా చేస్తూ వర్మ ఎటకారపు పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Tollywood Drug Case  Facebook Message  

Other Articles