వారం కాకముందే వివాదంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ | NTR Bigg Boss Show Hurt Their Feelings

Ntr bigg boss in controversy

NTR Bigg Boss Show, Telugu Bigg Boss Controversy, Hindu Groups NTR Bigg Boss, Bigg Boss Brahmins, NTR Bigg Boss Show Hurt, NTR Bigg Boss Controversy, Bigg Boss Controversies, NTR Show in Trouble

NTR Bigg Boss Show in Controversy. Brahmin Groups alleges that some scenes insult Hindutva Principles, should be apologized by Maa.

వివాదంలో ఎన్టీఆర్ బిగ్ బాస్.. సారీ చెప్పకపోతే రచ్చే!

Posted: 07/22/2017 10:35 AM IST
Ntr bigg boss in controversy

కాంట్రవర్సీలను క్రియేట్ చేసేందుకు ఓ చిన్న ఇష్యూ చాలూ. కొందరి సెంటిమెంట్లను దెబ్బ తీసే విధంగా షోలు చేయటం, ఆపై వాటితోనే టీఆర్పీలను పెంచేసుకోవటం షోలకు కామన్ గా మారిపోయాయి. మొన్నామధ్యే మొదలైన ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. తమ మనోభావాలను వ్యవహరిస్తున్నారంటూ ఓ వర్గం వాళ్లు రోడ్డుకెక్కేశారు.

స్టార్ మాటీవీలో ప్రసారమయ్యే 'బిగ్ బాస్' షోలో ఇప్పటికే ధూమపానం పెంపొందించేలా వ్యవహారం నడుస్తుందంటూ విమర్శలు వస్తుండగా, తాజాగా హైందవ సంస్కృతిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ బ్రహ్మణ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. హోమగుండం వద్ద బ్రష్‌ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వారంటున్నారు. వాటిని సవరించి, క్షమాపణ చెప్పని క్రమంలో ఆందోళన ఉదృతం చేస్తామని ఇప్పటికే జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి హెచ్చరించింది.

షో మొదలై వారం కూడా తిరగకముందే అప్పుడే ఇలా విమర్శలు వస్తుండటంతో మున్ముందు మరెన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందోనని చర్చించుకుంటున్నారు. అసలే వివాదాల షో కావటంతో ఇలాంటి వివాదాలు లేకుండా చూసుకుంటే మంచిదని నిర్వాహకులకు పలువురు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  Bigg Boss Show  Controversy  Hindu Groups  

Other Articles