ఉయ్యలవాడ ఉరి.. చిరు సూపర్ ఫ్లాన్ | Uyyalawada Hanged Episode Intro for Chiru

Chiru changes uyyalawada climax

Chiranjeevi, Chiru Mahaveera, Uyyalawada Climax Change, Uyyalawada Small Change, Uyyalawada Hanged Episode, Chiru Uyyalawada, Uyyalawada Scenes, Uyyalawada Emotional Intro, Uyyalawada Chiru Plan, Uyyalawada Muhurtham Shoot Date

Megastar Chiranjeevi’s Uyyalawada based on Uyyalawada Narasimha Reddy’s life can have a sad ending as the Britishers hanged him for 30 ears to keep the fear factor alive. There is a fair chance that the movie might begin with the hanging scene and the rest of the film will be a flashback of his life.

ఉయ్యలవాడ ఉరి ఎపిసోడ్ ఉంటుందా?

Posted: 07/21/2017 04:33 PM IST
Chiru changes uyyalawada climax

మెగాస్టార్ 151వ మూవీ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ముహుర్తంకు రంగం సిద్ధమైపోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఓపక్క లోకేషన్ల ఎంపికలో బిజీగా ఉన్నాడు. మరోపక్క బాడీ ఫిట్ నెస్ పై దృష్టిసారించిన చిరు కొత్త మేకోవర్ తో ఫోటో షూట్ కు రెడీ అయిపోతున్నాడు. ఈ నేపథ్యంలో టైటిల్ మహావీరగా ఛేంజ్ అయ్యిందనే వార్త రావటం, దానిని మేకర్లు కన్ఫర్మ్ చేయకపోవటం విదితమే.

ఇదిలా ఉంటే ఈ చిత్ర క్లైమాక్స్ విషయంలో ఓ చిన్న మార్పు చేయాలని చిరు భావిస్తున్నాడంట. ఉయ్యలవాడను బంధీగా పట్టుకున్న బ్రిటీషర్లు ఉరి తీసి, ఆయన తలను వాళ్ల కోట గుమ్మంకు ముప్పై ఏళ్లపాటు వేలాడదీశారు. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ లు అస్సలు వర్కవుట్ కావు. అలాంటిది చిరు విషయంలో ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకునే ఛాన్సే లేదు. అలాగని బయోపిక్ లో వాస్తవాలను దాచటానికి, మార్చటానికి స్కోప్ లేదు. అందుకే ఓ సూపర్ స్కెచ్ వేయబోతున్నారని సమాచారం.

చిత్ర ఆరంభంలోనే ఉయ్యలవాడ ఉరి ఎపిసోడ్, కోటకు వేలాడదీయటం లాంటి ఎపిసోడ్ ను రఫ్ గా ఓ పది నిమిషాలు ఇంట్రోలో చూపించేసి, ఆపై ఫ్లాష్ బ్యాక్ గా ఆయన వీర చరిత్రను చూపించేలా ఫ్లాన్ చేసుకుంటున్నాడంట. దాని ద్వారా హీరోయిజం ఎలివేట్ అవ్వటంతోపాటు ఫ్యాన్స్ ను కూడా మెప్పించొచ్చు కూడా. ఆగష్టు 15 నుంచి ఈ చిత్రాన్ని లాంఛ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రీమేక్ తో రీఎంట్రీ ఇచ్చాడన్న అపవాదుకు ఈ బయోపిక్ ద్వారా చెక్ పెట్టాలన్నది చిరు ఆలోచన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uyyalawada  Chiranjeevi  151 Movie  Climax Change  

Other Articles