స్పైడర్ కోసం ఖైదీ స్ట్రాటజీ? | Khaidi strategy for Mahesh Spyder Release

Mahesh spyder release date no need to change

Spyder Release Date, Spyder damage, Mahesh Babu Spyder, Spyder Khaidi No 150, Spyder Satakarni, Spyder Movie, Spyder Jai Lava Kusa, Spyder NTR, NTR Spyder, NTR New Movie, NTR Mahesh Clash

Mahesh Babu Spyder locked release date. September 27th Maker announces the date. But, at the same Jai Lavakusa and Paisa Vasool also released. movie traders suggest spyder makers to release early to escape from huge damage.

మహేష్ పోటీ రిలీజ్.. అయినా ప్రాబ్లమ్ లేదు

Posted: 07/18/2017 06:08 PM IST
Mahesh spyder release date no need to change

మహేష్ బాబు అభిమానులకు తీపి కబురు చెప్పేస్తూ సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు మేకర్లు. వంద కోట్ల బడ్జెట్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ బయోలాజికల్ వార్ మూవీ తెలుగుతోపాటు తమిళ్ లోనూ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోటీలో మరో రెండు సినిమాలు ఉండటంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మేకర్లు భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది.

స్పైడర్ తో పాటు రిలీజ్ అయ్యే సినిమాలు ఒకటి పూరి బాలయ్య పైసా వసూల్ కాగా, రెండోది ఎన్టీఆర్ బాబీల జైలవకుశ. వీటిలో పైసా వసూల్ ప్రీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలు వినిపిస్తుండగా, లవకుశ మాత్రం అనుకున్న టైంకే రావొచ్చనే సంకేతాలు అందించాడు నిర్మాత కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలో స్పైడర్ పోటీ పడితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఓ లుక్కేసుకుందాం. మొదటిది వారాంతపు సెలవులు కలిసి రావటం, గురువారం ప్రీమియర్ షోలను కలుపుకుని గాంధీ జయంతి దాకా వరుసగా కలెక్షన్లు కుమ్ముకోవచ్చు. ఒకవేళ ముందు వచ్చిన సినిమాకు తేడా టాక్ వచ్చినా సరే ఆ అడ్వాంటేజ్ బాగా ఉపయోగపడొచ్చని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో పక్క తర్వాత వచ్చే సినిమాకు థియేటర్లు అప్పగించేయాలి కాబట్టి ఖచ్చితంగా తర్వాత డ్రాప్ అయిపోవటం ఖాయం.

ఒకవేళ రెండో రిలీజ్ కు హిట్ టాక్ వచ్చి మొదటి దానికి డివైడ్ టాక్ వస్తే మాత్రం వారాంతం మినహాయించి తర్వాత వచ్చే కలెక్షన్లన్ని తర్వాత రిలీజ్ అయ్యే సినిమాకు మళ్లీ పోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మొదటిదానికే తేడా టాక్ వస్తే మాత్రం రెండోదానికి పంట పండినట్లే. ఈవేం కాకుండా రెండు సినిమాలకు సేమ్ టాక్ వచ్చిందనుకోండి. ముందు ఏది రిలీజ్ అయితే దానికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇది ఇంతకు ముందు ఖైదీ నంబర్ 150, బాలయ్య శాతకర్ణి విషయం లో స్పష్టంగా రుజువైంది. రెండు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ముందుగా వచ్చిన ఖైదీ ఓ రేంజ్ లో కుమ్ముకోగా, శాతకర్ణి ఆ రేంజ్ ను అందుకోలేకపోయింది. అయితే దీనికి మెజారిలీ థియేటర్ల లభ్యత అనేది కూడా ప్రభావం చూపుతుందనేది విశ్లేషకుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీ లింగువల్ కు భారీ దెబ్బ పడకుండా ఉండాలంటే పోటీ తప్పని సరి అయితే ముందు రిలీజ్ మంత్రం బెటరన్నది వారు ఇస్తున్న సలహా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Release Date  

Other Articles