లుక్కు సంగతి సరే.. కథలో కిక్కుందా? | Young Director Challenge to deal with Prabhas

Prabhas latest photo shoot

Prabhas Saaho Look, Prabhas New Photo Shoot, Baahubali Prabahs Photo Shoot, Prabhas New Movie, Prabhas Saaho Look, Prabhas Stylish Look, Prabhas New Photo Shoot

Hero Prabhas Saaho Look revealed. The Baahubali star is looking charishmatic and dashing. Big Challenge for director Sujith to deal with stylish action drama.

సాహో లుక్కు.. సుజిత్ రేంజ్ సినిమానేనా?

Posted: 07/18/2017 10:43 AM IST
Prabhas latest photo shoot

బాహుబలి తో స్టార్ ఇమేజ్ ను సాధించేసుకున్న ప్రభాస్ సాహో అంటూ 150 కోట్ల బడ్జెట్ సినిమాకు సిద్ధమైపోయాడు. దీని తర్వాత 1960 లో యూరప్ లో జరిగిన ఓ ప్రేమకథలో నటించబోతున్నానని చెప్పేశాడు. అయితే ఒకే ఒక్క సినిమా తీసిన సుజీత్ పై ఏ నమ్మకంతో ప్రభాస్ మూవీ ఓకే చెప్పాడు? బాహుబలి తర్వాత ఈ బిగ్ రిస్క్ కాదా? టీజర్ లో జస్ట్ స్టైలిష్ నెస్ ను చూపించేయటంతో అతని పనితనం ఓహో అని అనుకోగలమా? మేకింగ్ కన్నాముఖ్యమైన కథ, దానిని ఎలివేట్ చేయటం అనే రెండు విషయాలు ఇక్కడ కీలకం కాబోతున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ అని పిలిపించుకునే ప్రభాస్ ఐదేళ్ల క్రితం సాహో ఒప్పుకుని ఉంటే పెద్ద వండర్ అనిపించేది కాదు. బడ్జెట్ కూడా ఓ మోస్తరుగానే ఉండి ఉండేది. పైగా ఒకే భాష(తెలుగు) కే అది పరిమితం అయ్యి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రభాస్ ఉత్త ప్రభాస్ కాదు.. బాహుబలి ప్రభాస్ కదా!. అందుకే చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అందుకే సుజీత్ చాలా జాగ్రత్తగా అడుగు వేయబోతున్నాడని స్పష్టమౌతోంది. ప్రతీ సినిమాలో వేరియేషన్ చూపించే ప్రభాస్, సాహో కోసం కూడా కొత్తగా తయ్యారయ్యాడు.

టీజర్ తో చెప్పింది జస్ట్ థీమ్ మాత్రమే. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా అసలు మ్యాటర్ ముందుంది. బాలీవుడ్, కోలీవుడ్ తోపాటు మన జనాలకు కూడా నచ్చేలా ప్రభాస్ ను చూపించాలి. అందుకే మూడు నెలలు కష్టపడి లుక్కును ఫైనల్ చేసి ఓ ఫోటో షూట్ చేయించి వదిలాడు. ఎట్రాక్షన్ గా నేషనల్ వైడ్ టెక్నీషియన్స్ ను ఎంచుకుని ముందుకు సాగిపోనున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవుట్ ఫుట్ విషయంలో మాత్రం ఇప్పుడున్న కుర్ర దర్శకుల్లా కాకుండా సీనియర్ల మాదిరి కష్టపడి సినిమా తీయాల్సిందే. అప్పుడే ప్రభాస్ ఇమేజ్ కు డ్యామేజ్ కాకుండా, తన పేరును కూడా పాపులర్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Prabhas  Saaho Movie  Photo Shoot  

Other Articles