కొడుకు డ్రగ్స్ అలవాటు గురించి రవితేజ తల్లి | Mass Raja's Mother Open Up about Drug Case

Raviteja mother opens up about drugs issue

Hero Ravi Teja, Ravi Teja Mother, Rajyalakshmi Interview, Raviteja Mother Rajyalakshmi, Ravi Teja Mother Rajyalakshmi Bharat Death, Rajyalakshmi About Bharath Death, Hero Mother about Drugs, Raviteja mother Interview, Ravi Teja Drug Case scapegoat, Raviteja Drugs case, Drugs Case against Ravi Teja

Ravi Teja Mother about Ravi Teja Drug Habit. For the first time in her life, Ravi Teja’s mother Rajyalakshmi spoke to the media and opened up on all issues including her younger son Bharath’s recent death.

రవితేజకు డ్రగ్స్ కాదు కనీసం ఆ అలవాటు కూడా లేదు: తల్లి రాజ్యలక్ష్మి

Posted: 07/17/2017 03:46 PM IST
Raviteja mother opens up about drugs issue

టాలీవుడ్ ను షేక్ చేసిన మాదక ద్రవ్యాల కేసు లో టాప్ హీరో రవితేజ పేరు కూడా వినిపించిన విషయం విదితమే. ఈ మేరకు ఆయనకు కూడా సిట్ నోటీసులు పంపిందని, త్వరలో వ్యక్తిగతంగా విచారించనుందని హైలెట్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ గానీ, ఆయన కుటుంబ సభ్యులెవరూ దీనిపై నోరు మెదపలేదు. కానీ, ఈ సీనియర్ హీరో అమ్మ రాజ్యలక్ష్మి మీడియా ముందుకు వచ్చి ఫస్ట్ టైం మాట్లాడింది.

'రవితేజ కనీసం సిగరెట్ కూడా కాల్చడు. కానీ డ్రగ్స్ కేసులో తన పేరును ఉపయోగిస్తున్నారు. తనను భరత్ తో లింక్ చేయకండి. ఎలాంటి అలవాట్లు లేని రవితేజ ఓ జెంటిల్మన్. మా కుటుంబ ఆచారాల కారణంగానే.. తను భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. తమ్ముడు పోయిన బాధలో ఉండి కూడా.. నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో షూటింగ్ లో పాల్గొంటున్న మంచి వ్యక్తి నా కొడుకు' అన్నారామె. ఇక రవితేజ సోదరుడు భరత్ డ్రగ్స్ మూలంగానే ప్రాణాలు పొగొట్టుకున్నాడన్న వార్త అసత్యమని ఆమె ఖండించారు. అరెస్టయి విడుదలయ్యాక మారేందుకు యత్నించాడు. బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనే యాక్సిడెంట్ లో ప్రాణాలు కొల్పోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పటివరకూ తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, పైగా రవితేజ 15 రోజుల నుంచి ఫారిన్ షూటింగ్ లో ఉన్నాడని ఆమె తెలిపింది. భరత్ రవికి డ్రగ్స్ అలవాటు చేశాడని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే రవితేజ ఈ స్టేజీకి ఎదిగేవాడా? అంటూ ప్రశ్నించింది. కొందరిని తప్పించేందుకు ఈ కేసులో రవితేజను ఇరికిస్తున్నారని ఆమె పేర్కొంది. రవితేజ సన్నిహితుడు, కుటుంబ వైద్యుడు కడియాల రాజేంద్ర కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. ఇంతకు ముందు పూరీ కూతురు కూడా తన తండ్రి విషయంలో వస్తున్న కథనాలపై మండిపడ్డ విషయం చూశాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Rajyalakshmi  Drugs Case  

Other Articles

 • Nani reacted on story change rumour

  కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

  Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

 • Bigg boss contestant in prabhas movie

  ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

  Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

 • Kamal movie with chiyaan

  కమల్ నిర్మాత.. విక్రమ్ హీరోగా సినిమా

  Jan 20 | లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ మళ్లీ నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. త్వ‌ర‌లో చియాన్ విక్రమ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కమల్ రెండో తనయ అక్ష‌ర హాస‌న్ హీరోయిన్ గా న‌టించ‌బోతుండగా.. సినిమాకు కమల్ శిష్యుడు... Read more

 • Anasuya clarity on rangasthalam role

  రంగస్థలంలో అత్త పాత్ర కాదు : అనసూయ

  Jan 20 | హాట్ యాంకర్ అనసూయ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. రంగస్థలంలో రామ్ చరణ్ కు తాను అత్త పాత్రలో నటించట్లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. గత కొంత కాలంగా ఆమె చెర్రీకి అత్త పాత్రలో కనిపించబోతుందని... Read more

 • Varun tej next space thriller

  స్పేస్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్

  Jan 20 | షార్ట్ ఫిలింస్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్సించిన సంకల్ప్ రెడ్డి ద ఘాజీ ఎటాక్ తో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. చరిత్రలో కనుమరుగు అయిపోయిన అంశాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించి మూడు భాషల్లోనూ హిట్... Read more

Today on Telugu Wishesh