NTR Jai Lava Kusa Teaser Released

Jai lava kusa teaser out

Junior NTR, NTR New Teaser, NTR Jai Lava Kus Teaser, Jai Lava Kusa Teaser Review, Jai Lava Kusa Ravana Dialogue, NTR Jai Lava Kusa Dialogue, Jai Lava Kusa Telugu Movie Teaser, Jai Lava Kusa Teaser

Junior NTR Jai Lava Kus Teaser Released. Tarak as Bad Man Challenges with Ravana Character. Bobby Directorial venture and Niveda Thomas, Rashi Khanna and Nandiha Raj in lead roles.

జై లవకుశ టీజర్: రాముడు రావణుడ్ని చూపించేశాడుగా...

Posted: 07/06/2017 05:34 PM IST
Jai lava kusa teaser out

ఎన్టీఆర్ కొత్త సినిమా జైలవ కుశ టీజర్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంచనాలను అనుగుణంగానే టీజర్ ను కట్ చేసి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మూడు పాత్రల్లో ఒక క్యారెక్టర్ ను రివీల్ చేసేశారు. నెగటివ్ షేడ్స్ ఉన్న జై అలియాస్ జైరాం కు సంబంధించిన రోల్ ఇదేనని తెలుస్తోంది. 

ఇక టీజర్ ఎన్టీఆర్ రౌద్రం లుక్కులో కనిపించాడు. చేతికి గొలుసు కమ్ గండ్ర గొడ్డలితో కారులోంచి దిగటం, రావణ దహనం వేదికగా రౌడీలను ఉతికి ఆరేయటం చూపించారు. ‘‘ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా. ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత దదద... ధైర్యం ఉండాలా... ఉందా? అంటూ  ఆ క్యారెక్టర్ కు నత్తి మేనరిజం ఉన్నట్లు చూపించారు. స్లాంగ్ తోపాటు ఎన్టీవోడి లుక్కు కూడా అదిరిపోయింది.

దేవీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరోసారి చించేశాడు. అసుర.. అసుర.. అంటూ సాగి.. చివర్లో రావణా అంటూ మాస్ బీట్ తో ఊపేశాడు. ఇంకా రెండు క్యారెక్టర్లకు సంబంధించిన టీజర్లు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.  బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, రాశీఖన్నా మరియు నందితారాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, దునియా విజయ్, రోనిత్ రాయ్ లు విలన్లుగా నటిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Jai Lava Kusa  Teaser Review  

Other Articles