Tarak Fans Cannot Wait For Jai Lavakusa Teaser

Triple bonanza for tarak fans

Junior NTR, NTR Teaser, Jai Lava Kusa Teaser, Jai Lava Kusa New Teaser, NTR Jai Lava Kusa, NTR 27th Official Teaser, NTR Three Roles Teaser, NTR Jai Lava Kusa Teasers, NTR Triple Treat Teasers, NTR Fans Jai Lava Kusa

Junior NTR Jai Lava Kusa Teaser on July 6th. Fans Excited before release. Even though leakage hype not down.

తారక్ టీజర్.. ట్రిపుల్ బోనాంజా

Posted: 07/05/2017 03:00 PM IST
Triple bonanza for tarak fans

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కొత్త చిత్రం జై లవకుశ ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జూలై 6న సాయంత్రం 5.22 నిమిషాలకు టీజర్ ఉంటుందని ఇదివరకే ఎన్టీఆర్ సోదరుడు, చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే లీక్ వ్యవహారంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ అప్ సెట్ అయ్యింది. మరి ఈ నేపథ్యంలో టీజర్ అసలు ఉంటుందా? ఉంటే అదేనా? లేక వేరేనా? ఇలా ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు.

మరి రేపు విడుదల చేయనున్న టీజర్ లో అదే కంటెంట్ ఉంటుందా? లేదంటే కొత్త కంటెంట్ తో మళ్లీ సిద్ధం చేశారా? అనేది ఆసక్తిగా మారింది. అయితే పెద్దగా వైరల్ కాకపోవటంతో అదే టీజర్ ను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చాలాదన్నట్లు మరో న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. చిత్రంలో తారక్ ట్రిపుల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మూడు రోల్స్ కి సంబంధించిన టీజర్లను విడుదల చేయాలని భావిస్తున్నారంట.

నెగటివ్ రోల్ తోపాటు మరో రెండు రోల్స్ లో(జై, లవ్ కుమార్, కుశ) ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో రాశిఖన్నా .. నివేదా థామస్ .. నందితా రాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరి టీజర్స్ తో జూనియర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా? అని ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ తో వెయిట్ చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Jai Lava Kusa  Movie Teaser  

Other Articles