Rajamouli Dub Movie Creates phenomenal record in Youtube

Baahubali craze magadheera phenomenal record

Magadheera, Magadheera Hindi Version, Magadheera Youtube Record, Magadheera Baahubali, Baahubali Craze Magadheera, South Movie Dub hindi, South Movie Youtube Records, Rajamouli Hindi Dub Movies, Magadheera phenomenal record

Magadheera 100 million Youtube views record in Hindi Version. Rajamouli and Baahubali Craze Helps this unique record. This is the south dub movie

బాహుబలి క్రేజ్ తో సరికొత్త రికార్డు

Posted: 07/03/2017 11:10 AM IST
Baahubali craze magadheera phenomenal record

ఒక్క క్రేజీ ప్రాజెక్టుతో తన పేరును, మార్కెట్ రేంజ్ ను పెంచేసుకున్న రాజమౌళి బాలీవుడ్ లోనూ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు. జక్కన్న ఊ.. అంటే సరే ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయినా పెట్టి సినిమా తీసేందుకు కరణ్ జోహర్ లాంటి మేకర్లు రెడీగా ఉన్నారు. అయినప్పటికీ బాలీవుడ్ పై నాట్ ఇంట్రెస్టెడ్ అన్న ధోరణిలో వ్యవహరిస్తూ తెలుగులోనే మరో సాధాసీదా సినిమా తీసేందుకు సిద్ధమైపోతున్నాడు.

ఇదిలా ఉంటే బాహుబలి దెబ్బకు నెట్ లో రాజమౌళి పాత సినిమాలకు కూడా గిరాకీ బాగానే పెరిగిపోయింది. యూట్యూబ్ లో ధర్శకధీరుడి సినిమాలను ఎగబడి మరీ చూసేశారు. ఈ క్రమంలో రాంచరణ్ నటించిన మగధీర కొత్త రికార్డును క్రియేట్ చేసింది. సౌత్ తరపున ఓ డబ్బింగ్ సినిమాను అత్యధిక మంది వీక్షించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం మగధీర సినిమాను 100 మిలియన్ వ్యూవ్స్ వచ్చేశాయి. ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్ రికార్డు.

అయితే దీనికి ఒక్క రాజమౌళి, బాహబలిలే కారణం అని చెప్పటానికి వీల్లేదు. రీసెంట్ గా అక్కడ రాబ్తా విడుదలై డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. సినిమా రీలీజ్ సమయంలో మగధీర కాపీ అంటూ వివాదం చెలరేగింది. ఇది కూడా జనాల్లో హిందీ మగధీర పై ఆసక్తి క్రియేట్ చేసింది. ఏదైతేనేం బాహుబలి లాగే మగధీర కూడా విజువల్ ట్రీట్ కావటంతో జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మొత్తానికి తన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీపై ఓ బ్రాండ్ మార్క్ పడేలా చేసేశాడు జక్కన్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Magadheera  Hindi version  Youtube  Rajamouli  

Other Articles