Spyder not interest to Clash with Nandamuri Flicks

Mahesh spyder again delayed

Mahesh Babu, Mahesh Babu Spyder, Mahesh Babu Diwali 2017, SPYder Release Date, Mahesh Babu SPYder Delay, Mahesh Nandamuri Heroes, Mahesh NTR Balayya, Nandamuri Heroes SPYder Movie

Mahesh Babu Spyder Movie Again Delay. Shifts to Dussera to Diwali but not yet officially Confirmed.

స్పైడర్ డిలే.. మళ్లీ ఎందుకో?

Posted: 06/26/2017 03:56 PM IST
Mahesh spyder again delayed

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. మురగదాస్ అతి జాగ్రత్త మూలంగా సమ్మర్ కే రావాల్సిన సినిమా మరో ఆరు నెలలకు ముందుకు వెళ్లింది. చివరకు ఎట్టకేలకు దసరా రేసులో ఉంటుందని అంతా ఫిక్సయ్యారు. అయితే సినిమా ఆ టైంకి కూడా రావటం కష్టంగానే కనిపిస్తోంది.

షూటింగ్ పూర్తయినప్పటికీ ఆ సమయానికి నందమూరి ఫ్యామిలీ నుంచి రెండు సినిమాలు బరిలో దిగబోతున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్-బాబీల జైలవకుశ కాగా, మరోకటి బాలయ్య పూరీల పైసా వసూలు. ఈ రెండు చిత్రాలు కూడా సెప్టెంబర్ 21, 29 అంటూ తేదీలను ప్రకటించేశాయి. ఈ రెండింటి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో మహేష్ మళ్లీ డైలామాలో పడ్డట్లు సమాచారం.

తన సినిమాల విషయంలో చాలా పక్కాగా ఉండే మహేష్ బిగ్ హీరోలతో పోటీ పడేందుకు ఇష్టత చూపడు. పైగా భారీ బడ్జెట్ మూవీ కావటంతో ఆ రిస్క్ అస్సలు చేయొద్దని డిసైడ్ అయ్యాడంట. ఈ నేపథ్యంలో సినిమా దీపావళికి షిఫ్ట్ కాబోతుందని తెలుస్తోంది. త్వరలో చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  SPYder Movie  Nandamuri Heroes  

Other Articles