Shankar Movie not Turn This Actor's Fate

Kollywood actor begging at chennai temple

Actor Pallu Babu, Pallu Babu Story, Actor Begging, Actor Begging Chennai Temples, Kadhal Movie, Kadhal Actor Begging, Shankar Movie Actor Beg, Presmiste Actor Begging

Actor Pallu Babu who acted in Shankar Movie Kadhal (Presmiste) Now Begging at Temples. No Makers giving any opportunity even Shankar also.

శంకర్ సినిమాలో చేశాడు.. అడుక్కు తింటున్నాడు

Posted: 06/24/2017 10:19 AM IST
Kollywood actor begging at chennai temple

టాలెంట్ ఉన్నా ఒక్క ఛాన్స్ అంటూ స్డూడియోల చుట్టూ తిరిగే కళాకారులు ఎందరో. అయితే అదొక్కటే కాదు.. అదృష్టం అంతకు మించి రికమండేషన్లు కూడా ఉంటేనే సినిమా ఛాన్సులు వస్తాయి అంటున్నాడు కోలీవుడ్ నటుడు పల్లు బాబు. నటన మీద వ్యామోహంతో చెన్నై వచ్చిన ఇతగాడు ఇప్పుడు రోడ్ల మీద బిచ్చమెత్తుకుంటూ దీనస్థితిలో కనిపిస్తున్నాడు.

తమిళ్ లో కొన్నేళ్ల క్రితం కాదల్(తెలుగులో ప్రేమిస్తే...) చిత్రం వచ్చింది గుర్తుంది కదా? శంకర్ నిర్మాతగా బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథ అక్కడా ఇక్కడా రెండుచోట్ల పెద్ద హిట్టే అయ్యింది. అయితే ఇందులో నటించిన నటుడు పల్లుబాబు పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది. ఓ సీన్ లో హీరో భరత్, హీరోయిన్ సంధ్యను తీసుకుని ఓ స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. హీరోగా నటిస్తా, ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్తా, ఆ తరువాత సీఎం అవుతా' అంటూ విరుచ్చికాంత్ క్యారెక్టర్ లో నటుడు చెప్పిన డైలాగులు మంచి ఆదరణ పొందాయి.

అతనే పల్లుబాబు. కాదల్ అంత పెద్ద హిట్ అయినా పల్లుబాబుకు తరువాత అవకాశాలు లభించలేదు. దీనికి తోడు ఆర్థిక కష్టాలు అతని కుటుంబాన్ని వెంటాడాయి. తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. బంధువులు కూడా దూరంపెట్టడంతో.. అనాథగా చెన్నైలోని చూలైమేడులోని ఓ గుడిముందు కూర్చుని వచ్చీపోయే భక్తులను బిచ్చం ఎత్తుకుంటున్నాడు. సినిమాల్లో నటించాలని ఉన్నా క్యారెక్టర్ ఇవ్వాలంటే ఎవరైనా పెద్ద నటీనటులతో చెప్పించమని అడుగుతున్నారని పల్లుబాబు చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Kadhal Movie  Pallu Babu  

Other Articles