Rajinikanth Political Entry Lack Clarity

Rajinikanth again comments on political entry

Rajinikanth, Rajinikanth Political Entry, Rajinikanth Clarity, Rajinikanth No Clarity, Rajinikanth edia, Rajinikanth Political Party, Rajinikanth Standards, Rajinikanth

Rajinikanth Again made Comments on Political Entry. Never says i am not enter into it Thalaiva with Media.

రాజకీయాలపై రజనీ రంగులు మారుస్తున్నాడు

Posted: 06/23/2017 12:56 PM IST
Rajinikanth again comments on political entry

సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ ఆరంగ్రేటం వ్యవహారం రాను రాను రాజు గుర్రంలా తయారు అవుతోంది. ఓ ఆసక్తి లేదంటూనే మరోవైపు తాను తమిళియన్ నే నంటూ దేవుడు శాసిస్తే తాను పాటిస్తానంటూ సినిమాటిక్ డైలాగ్ లతో స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తక్షణం రాజకీయాల్లోకి రావాలని అభిమానులు నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ మరోసారి హాట్ కామెంట్లు చేశాడు.

కాలా షూటింగ్ లో భాగంగా చెన్నై ఎయిర్ పోర్టులో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాబోనని చెప్పడం లేదని. ఈ విషయంలో చర్చలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. గత నెలలో అభిమానులతో సమావేశమైన రజనీకాంత్, "యుద్ధానికి సిద్ధం కండి" అని వ్యాఖ్యానించిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. "యుద్ధం వస్తే, మాతృభూమిని కాపాడుకునేందుకు మీరంతా ముందుకు వస్తారని నాకు తెలుసు. నేనో వృత్తిలో ఉన్నాను. ఈ సమయంలో పనే ముఖ్యం. మీరు కూడా మీ ఊర్లకు వెళ్లి, మీ విధులు నిర్వర్తించండి. యుద్ధం వచ్చిన వేళ చూసుకుందాం" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లే చేశాడు.

రజనీ వస్తే.. మేం రెడీ!

కాగా, పుట్టినరోజు డిసెంబర్ 12 కంటే ముందే రజనీ మరోసారి అభిమానులతో సమావేశమై, రాజకీయాలపై ఓ కీలక నిర్ణయం తీసుకోవచ్చని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోబో 2.0 షూటింగ్ పూర్తి చేసిన రజనీ కాలా షూటింగ్ లో చెన్నై టూ ముంబై చక్కర్లు కొడుతున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Political Entry  Dilemma  

Other Articles