Keerthy Suresh Special Wishes to Ilayathalapathy

Keerthy suresh showing her talent in twitter

Keerthy Suresh, Keerthy Suresh Special Birthday, Actress Keerthy Suresh 43rd Vijay, Keerthy Suresh Special Talent, Keerthy Suresh Art Work, Keerthy Suresh Muti talent, Keerthy Suresh Vijay Special Birthday, Keerthy Suresh Vijay, Keerthy Suresh Special Wish Vijay, Vijay 61 Movie First look, Vijay Mersal

Actress Keerthy Suresh Special Wishes to Ilayathalapathy. She painted Vijay's art on actor's 43rd Birthday.

ఇదయదళపతికి కీర్తి వెరైటీగా విషెస్ చెప్పిందిగా...

Posted: 06/22/2017 05:46 PM IST
Keerthy suresh showing her talent in twitter

ఓ పక్క టాలీవుడ్, మరో పక్క కోలీవుడ్.. రెండు ఇండస్ట్రీల్లో టాప్ లీగ్ లో ఉంది మల్లూ బ్యూటీ కీర్తి సురేష్. పవన్ కళ్యాణ్, విజయ్, సూర్య లాంటి అగ్రశ్రేణి హీరోలతోనే కాదు.. నాని, శివకార్తీకేయన్ లాంటి యంగ్ స్టర్లతో కూడా హిట్లు కొట్టి బిజీ స్టార్ ట్యాగ్ లైన్ తగిలించేసుకుంది. లౌక్యం తెలిసిన బ్యూటీగా అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ కెరీర్ ను మలుచుకుంటుంది.

ఇదిలా ఉంటే కోలీవుడ్ న‌టుడు విజ‌య్ పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సినీ సెలబ్రిటీలు ఇదయదళపతికి సోష‌ల్ మీడియా లో శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అయితే కీర్తి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గానే విషెస్ తెలియజేసింది. స్వయంగా ఓ చిత్రం వేసి ఆకట్టుకుంది. కత్తి సినిమాలో షాడో పోస్టర్ ను పెయిటింగ్ గా వేసి విజయ్ కు స్పెషల్ గ్రీటింగ్స్ చెప్పింది. ఇంతకు ముందు వీరిద్దరు భైరవా అనే ఓ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

ఈ యేడాది సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన ఆ చిత్రం అంతగా ఆడలేదు. ప్రస్తుతం అదే చిత్రాన్ని తెలుగులో ఏజెంట్ భైరవగా డబ్ చేస్తున్నారు. విజయ్ కు విషెస్ చెప్పిన వారిలో దర్శకుడు మురుగ‌దాస్ 'హ్యాపీ బ‌ర్త్ డే విజ‌య్ స‌ర్' అంటూ ట్వీట్ చేశారు. మ‌రో హీరోయిన్ కాజల్ కూడా విజ‌య్‌కి హ్యాపీ బ‌ర్త్ డే చెబుతూ ఆయ‌న మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ilayathalapathy  Vijay 43rd Birthday  Keerthy Suresh  

Other Articles