Record Price for Rangasthalam Satellite Rights.

Record price for ramcharan s next satellite rights

Rangasthalam 1985, Rangasthalam 1985 Rights, Rangasthalam 1985 Satellite Rights, Record Price Rangasthalam 1985, Rangasthalam Rights, Rangasthalam 1985 Movie, Rangasthalam 1985 Rs 16 Crore Deal,

Ram Charan Reaching New Heights With His Upcoming Flick Rangasthalam 1985. the satellite rights have been fixed at Rs 16 Cr and a popular TV Channel is ready to pay said amount.

షాకింగ్ రేటుకు రంగస్థలం రైట్స్.. ఎంతంటే...

Posted: 06/22/2017 04:55 PM IST
Record price for ramcharan s next satellite rights

రాంచరణ్ కెరీర్ లో రంగస్థలం ఓ స్పెషల్ మూవీగా మిగలటం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతవరకు లేని విధంగా మాస్ గెటప్ లో చెర్రీని దర్శకుడు సుకుమార్ ప్రజెంట్ చేస్తుండటం, పైగా టైటిల్ దగ్గరి నుంచి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రీకరిస్తున్నారు. ఆన్ లోకేషన్ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే 40 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ పిరియాడికల్ సోషల్ డ్రామాను తెరకెక్కిస్తోంది. దీపావళికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఈ మూవీ రైట్స్ అమ్మకం ఇప్పటి నుంచే ప్రారంభం అయిపోయింది. శాటిలైట్ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడగా, షాకింగ్ రేటుకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఓ ప్రముఖ టీవీ చానల్ వాళ్లు 16 కోట్లను ఆఫర్ చేశారట. త్వరలోనే ఈ డీల్ ఖరారయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

పక్కా విలేజ్ బ్యాగ్రౌండ్ మూవీ కావటం, చెర్రీ-సుక్కూ క్రేజీ కాంబో, పైగా వెరైటీ టైటిల్, స్టోరీ లైన్ ఇవన్నీ ఆసక్తి కరంగా ఉండటంతో ఈ స్థాయి రేటు పలికిందని స్పష్టమౌతోంది. మున్ముందు ఈ అంచనాలు తారాస్థాయికి చేరే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam 1985  Ram Charan  Sukumar  Satellite Rights  

Other Articles