Chief Minister Cameo in Kannada Film

Chief minister siddaramaiah in reel life

Kavitha Lankesh, Summer Holidays, Karnataka CM Siddaramaiah, Siddaramaiah Acting, Siddaramaiah Debut, Siddaramaiah Silver Screen, Siddaramaiah New Avatar, Siddaramaiah Bilingual Movie, Siddaramaiah New Movie, Siddaramaiah Make Up, Kavitha Lankesh Siddaramaiah, Real CM Reel Life CM

Karnataka CM Siddaramaiah Ready to Debut. Star in Kannada-English movie 'Summer Holidays' as reel life CM Directed by Kavitha Lankesh.

సినిమాలో మిస్టర్ చీఫ్ మినిస్టర్.. ఎలాంటి రోల్?

Posted: 06/22/2017 12:19 PM IST
Chief minister siddaramaiah in reel life

తన చేష్టలతో, నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. త్వరలో ఆయన ముఖానికి మేకప్ వేసుకుని ఓ సినిమాలో నటించబోతున్నాడు. అయితే అందుకోసం ఆయన రీల్‌ సీఎంగా మారబోతున్నాడని సమాచారం. కన్నడ యంగ్ లేడీ డైరక్టర్ కవితా లంకేశ్‌ ‘సమ్మర్‌ హాలిడేస్‌’ పేరుతో ఓ సినిమా తీయబోతుంది. కన్నడతోపాటు ఇంగ్లీష్ లోనూ అది తెరకెక్కిస్తుందంట. ఇందులో సీఎం పాత్రలో ఆయన నటించనున్నారని ప్రకటించింది

ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవన్న హామీ మీదే ఆయన నటించేందుకు అంగీకరించారని ఆమె తెలిపారు. ఆ వార్త నిజమేనంటూ సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 80% షూటింగ్‌ పూర్తయిందని, కేవలం సీఎంపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, సీఎం ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడే చిత్రీకరణ జరుపుతామని కవిత తెలిపింది.

ఇక రామయ్య కాలేజీ రోజుల్లో సరదాగా నటించేవారంట. నటనపై ఆయనకు చాలా మక్కువ ఉందని, ఆ మక్కువతోనే ఆయన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నపాత్రే అయినా మాంచి ఇంపాక్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, కవిత పాపులర్ కన్నడ రైటర్ దర్శకుడు అయిన లంకేశ్ కూతురు. సెలవుల్లో ఓ నలుగురు పిల్లలు చేసిన హంగామా మీదే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  CM Siddaramaiah  Summer Holidays Movie  Kavitha Lankesh  

Other Articles