Restless Mahesh busy with SYPyder Koratala Movies

Mahesh join bahart anu ninu after spyder climax

Mahesh Babu, Mahesh Babu Back to Back, Mahesh Babu Murugadoss, Mahesh Babu Koratala Movies, Mahesh Babu New Movie, Mahesh Babu Bharat Anu Nenu, Mahesh Babu Restless Shoot

Mahesh Babu joins in koratala Movie sets. Special Climax for SPYder. Murugadoss balance two songs only.

మహేష్ మూవీస్.. రెస్ట్ లేకుండానే

Posted: 06/21/2017 05:31 PM IST
Mahesh join bahart anu ninu after spyder climax

మురుగదాస్ వదిలిన 'స్పైడర్' క్లైమాక్స్ పూర్తవగానే వెంటనే కమిట్ మెంట్ ప్రకారం కొరటాల మూవీ భరత్ అను నేను సెట్ లో జాయిన్ అయిపోయాడు సూపర్ స్టార్. సాధారణంగా సినిమా సినిమాకు గ్యాప్ లో వెకేషన్ మీద ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేసే మహేష్ ఇప్పుడు మాత్రం ఆ పని చేయలేదు. స్పెషల్ అసెంబ్లీ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

ఇక స్పైడర్ క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందోననే విషయం అభిమానులకు అర్థమైపోయింది. ఆ అంచనాలకి ఎంత మాత్రం తగ్గకుండా క్లైమాక్స్ దృశ్యాలను మురుగదాస్ ప్లాన్ చేసుకున్నాడు. భారీస్థాయిలో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ను పీటర్ హెయిన్స్ కంపోజ్ చేశాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫైట్స్ ను చెన్నైలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించారట. ఎపిసోడ్స్ కి సంబంధించిన అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందనీ .. సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణతో టాకీ పార్టు పూర్తయిందని చెబుతున్నారు. ఇక రెండు పాటలు మాత్రమే పెండింగ్ వున్నాయి .. వాటిని త్వరలోనే షూట్ చేయనున్నారట. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మరోవైపు మహేష్ 24వ మూవీ భరత్ అను నేను సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  SPYder Movie  Koratala Movie  

Other Articles