Police Case filed against Chalapathi Rao on Derogatory Comments

Nagarjuna condemns chalapathi rao derogatory comments

Actor Chalapathi rao, Chalapathi rao Live Debate, Nagarjuna Chalapathi Rao, Nagarjuna Respect Woman, Chalapathi Rao Derogatory Comments, Nagarjuna Chalapathi Rao Comments

Actor Chalapathi Rao clarity on His Derogatory Comments, Nagarjuna Condemns This Senior Actor Comments in Twitter.

చలపతిరావు కామెంట్స్ ను ఖండించిన నాగ్.. పోలీస్ కేసు

Posted: 05/23/2017 01:14 PM IST
Nagarjuna condemns chalapathi rao derogatory comments

మహిళలపై చేసిన వెకిలి కామెంట్లపై ఎట్టకేలకు సీనియర్ నటుడు చలపతిరావు వెనక్కి తగ్గాడు. ఆడది లేకపోతే మగాడు లేడంటూ ఓ ఛానెల్ లైవ్ లో తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'రారండోయ్ వేడుక చూద్దాం' వేడుకలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడంటూ ఈ టాలీవుడ్ నటుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటం తెలిసిందే. మొత్తం యూనిట్ అంతా మహిళా లోకానికి సారీ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ చలపతిరావు మండిపడ్డారు.

ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని, ట్రంప్, ఒబామా.. ఇలా ఏ ప్రముఖులను చూసినా, తనలాంటి వారిని తీసుకున్నా స్త్రీ సేవలు మరువలేనివని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆడవాళ్లు పక్కలోకి పనికొస్తారంటే... కేవలం సెక్స్ మాత్రమే కాదని, ప్రతీ విజయంలో ముందుంటారనే కోణంలో మాట్లాడానని, నా వ్యాఖ్యల్లో అంతకంటే ఎన్నో ఉన్నత భావాలు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.

మరోవైపు మహిళల మనోభావాలు దెబ్బతినేలా చలపతిరావు మాట్లాడారంటూ మహిళా సంఘాల నేతలు జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. చలపతిరావు వ్యాఖ్యల తర్వాత యాంకర్ రవి 'సూపర్ సార్' అంటూ గట్టిగా అరిచాడని... రవి కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. ఇక ఈ వ్యాఖ్యలపై నాగ్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యాడు. వ్యక్తిగతంగానే కాదు, తన సినిమాల్లో ఆడాళ్లకు ఎంతో మర్యాద ఇస్తానన్న నాగ్ చలపతిరావు వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Chalapathi Rao  Derogatory Comments  Nagarjuna Condemns  

Other Articles