Sr Actress` Rude Satire on Rajini తలైవా అభిమానులతో నటి ట్విట్టర్ యుద్దం

Actress war with rajinikanth fans on social media

kasturi on rajini political entry, kasturi #nobattlecriesplease, actress kasturi satire on rajini, kasturi battle with rajini fans, Rajnikanth, Kasturi, Political entry, Twitter, Rajini fans, Tollywood, kollywood

Yesteryear actress Kasturi, has now made it to headlines by making some objectionable comments against Superstar Rajinikanth.

తలైవా అభిమానులతో నటి ట్విట్టర్ యుద్దం

Posted: 05/21/2017 10:58 AM IST
Actress war with rajinikanth fans on social media

రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న డైలిమాలో యుద్దం అరంభమైనప్పుడు చూద్దాం అని ఒకసారి.. రాజకీయాలపై తాను చెప్పాల్సింది చెప్పేశాను అని మరోసారి చెప్పి.. ఇకపై తన రాజకీయ అరంగ్రేటం విషయమై ప్రశ్నలు వేయవద్దని చెప్పిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై సినీ నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. రజనీ నాన్చుడు ధోరణి విరక్తి కలిగిస్తోందని పేర్కొంది. ఐదేళ్లుగా అభిమానులను కలుసుకుంటున్న ఆయన యుద్ధం.. యుద్ధం అంటూ బోరో కొట్టిస్తున్నారని వాఖ్యలు చేసింది.

అంతేకాదు రాజకీయ అరంగేట్రానికి చాలా ధైర్యం కావాలని కూడా సూచించింది. రాజకీయ ప్రవేశంపై రజనీ ఏళ్ల తరబడి ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేసింది. అమె వ్యాఖ్యల నేపథ్యంలో తలైవా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అమెను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే వాటిపై ఏమాత్రం తడుముకోకుండా అమె బదులిచ్చింది. ఒక అభిమానినైతే చెడాపెడా తిట్టిపోసినంత పనిచేసింది. రజనీకి తాను ఎప్పటి నుంచో ఫ్యాన్ నని చెప్పింది.

‘‘నీవు కూడా రజనీ గురించి మాట్లాడుతున్నావా?.. టైమ్.. ఏం చేస్తాం.. నోరు మూసుకో’’ అంటూ ఓ అభిమాని ఘాటుగా కౌంటరిచ్చాడు. దీనికి కస్తూరి కూడా అంతే ఘాటుగా స్పందించింది. ‘‘నీవు పుట్టక ముందు నుంచే నేను రజనీ అభిమానిని. నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్ల రజనీకి చెడ్డపేరు, అవమానం. ముందు నీ నోరు మూసుకో’’ అని చెంప చెళ్లుమనేలా బదులిచ్చింది. ‘‘సినిమాల్లో ఉండి రజనీని విమర్శిస్తావా.. ఎంత అమర్యాద!’’ అన్న మరో వీరాభిమాని కామెంట్‌కు కస్తూరి స్పందిస్తూ తాను చేసింది విమర్శలు కావని, విరక్తితోనే అలా అన్నానని, ఇదే అభిప్రాయం అందిరిలోనూ ఉందని, కాకపోతే తాను బయటపెట్టానని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnikanth  Kasturi  Political entry  Twitter  Rajini fans  Tollywood  kollywood  

Other Articles