Raai Laxmi says no to marriage కెరీర్ పైనే నా దృష్టి.. అప్పుడే పెళ్లేంటీ..!

Raai laxmi keeps her focus on career says no to marriage

raai lakshmi actress, lakshmi rai actress, raai lakshmi julie 2, raai lakshmi marriage, raai lakshmi marriage proposal, raai lakshmi, lakshmi rai, julie-2, bollywood, entertainment

Raai Laxmi who is eagerly waiting for the release of her Bollywood movie ‘Julie 2’ says no to marriage proposals right now. she is currently enjoying holidays.

కెరీర్ పైనే నా దృష్టి.. అప్పుడే పెళ్లేంటీ..!

Posted: 05/20/2017 07:20 PM IST
Raai laxmi keeps her focus on career says no to marriage

వెండి తెరపై గ్లామర్ తో కట్టిపడేసిన కథానాయికలలో రాయ్ లక్ష్మీ ఒకరు. ఇక అందాల అరోబోతకు కూడా వెనకాడని ఈ అమ్మడు.. ఎంతగా కవ్విస్తూ.. యూత్ ను మెప్పిస్తూ వస్తున్నా, ఆమెకి సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. దాంతో తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళుతోంది. నటిగా ఆమె ప్రయాణం 12 యేళ్లుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడామె అశలన్నీ త్వరలో విడుదల కానున్న జూలీ-2 చిత్రంపైనే వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తై పోస్టు ప్రోడక్షన్ పనులను కూడా ముగించేసుకుంది.

దీంతో ఆమె విదేశాలకు వెళ్లి అక్కడ ఎండ దెబ్బకు బీచ్ లలో సేదతీరుతుంది. అన్నట్టు అక్కడకు చేరినా.. తన అభిమానులను మాత్రం మరింత మత్తులోకి జారుకునేలా బీచ్ లో దిగిన ఫోటోలను తన సామాజిక మాద్యమాల ద్వారా పంచుకుంటుంది. అమె చిత్రాలను చూసి అభిమానులు ఔరా..! అని తెగచూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెను ఓ మీడియా కలసి అగడరాని ప్రశ్న అడిగింది.

మీ పెళ్లెప్పుడు? అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అప్పుడే తాను పెళ్లి గురించి ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చిందని రాయ్ లక్ష్మి అంది. 30 దాటిన వాళ్లు పెళ్లి ఊసెత్తకుండా కెరియర్ ను కొనసాగిస్తూ ఉండగా, అంత వయసులేని తానెందుకు తొందరపడాలని అంది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదనీ .. కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టానని చెప్పింది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నానంటూ మనసులో మాట చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raai lakshmi  lakshmi rai  julie-2  bollywood  entertainment  

Other Articles