Actress Reema Lagoo Passes Away

Veteran actress reema lagoo died

Reema Lagoo, Reema Lagoo Death News, Reema Lagoo Passes Away, Reema Lagoo Died, Reema Lagoo Cardiac Arrest, Bollywood Death News, Bollywood favorite Mom Died, Senior Actress Cardiac Arrest Died, Bollywood Condolence Reema Lagoo, Reema Lagoo Salman Khan, SRk Reema Lagoo

Bollywood Veteran Actress Reema Lagoo died due to Cardiac Arrest. Celebs pay condolences in Social Media for this favorite Mom.

వెటరన్ నటి రీమా లగూ కన్నుమూత

Posted: 05/18/2017 09:32 AM IST
Veteran actress reema lagoo died

బాలీవుడ్ ఫేవ రెట్ మామ్ రీమా లగూ ఇక లేరు. 59 ఏళ్ల ఈ సీనియర్ నటి గురువారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించగా, ఆస్పత్రి వర్గాలు కూడా మీడియాకు సమాచారం అందించాయి.

మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ చిత్రాల్లో ఆమె నటిస్తూనే ఉన్నారు. ఓవైపు సినిమాలు మరో వైపు బుల్లితెర లో అమ్మ పాత్రతో ఆమె చెరగని ముద్ర వేశారు. సల్మాన్, అక్షయ్ కుమార్, శ్రీదేవి, మాధురి దీక్షిత్, షారూఖ్ ఇలా దాదాపు అందరు స్టార్లకు తల్లి పాత్రలో ఆమె చేశారు. హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, మైనే ప్యార్ కియా, కల్ హో నహో లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తూ తూ మై మై, శ్రీమాన్, శ్రీమతి సిరియళ్లలో ఆమె నటించింది.

గతేడాది నామకరణ్ అనే సీరియల్ లో ఆమె చివరి సారిగా నటించింది. ఈ వెటరన్ నటి మృతి వార్త తెలియగానే బాలీవుడ్ తోపాటు బుల్లితెర ప్రముఖులంతా సోషల్ మీడియాలో సంతాప సందేశాలతో నింపేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Veteran Actress  Reema Lagoo  Death News  

Other Articles