Police complaint against Jabardasth and Pataas

Jabardasth and pataas another trouble

Nandanam Diwakar, Jabardasth and Pataas, Censor Member ETV Shows, Pataas Anchors Abusiveness, Ravi Lasya Police Complaint, Censor Board Member Nandanam Diwakar, Roja Jabardasth Anchor, Jabardasth Anchors Police Complaint, ETV Anchors Police Complaint

Censor Board Member Nandanam Diwakar files complaint against Jabardasth and Pataas shows. Anchors encouraging abusiveness with their acts,

పటాస్, జబర్దస్త్ లపై పోలీస్ ఫిర్యాదు

Posted: 05/17/2017 01:08 PM IST
Jabardasth and pataas another trouble

జబర్దస్త్ షో మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న ఈ కామెడీ షోతో పాటు మరో కార్యక్రమం పటాస్ పైనా పోలీసు ఫిర్యాదు నమోదైంది. సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ స్వయంగా దీనిపై స్పందించటం ఇక్కడ విశేషం. ఈ రెండు టీవీషోలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయని మంగళవారమే బాలానగర్ పోలీస్ స్టేషన్ లో దివాకర్ ఫిర్యాదు చేశాడు.

ఈ రెండు షోలలో జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, పటాస్ యాంకర్లు శ్రీముఖి, రవిలపై విరుచుకుపడ్డారు. రవి, శ్రీముఖి చిలిపి చేష్టల వల్ల యువతలో తప్పు చేయాలన్న అభిప్రాయం కలుగుతోందని ఆరోపించాడు. వెంటనే ఆ నలుగురు తమ షో ల నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఈ షోలను ప్రజలు ఆదరిస్తున్నారని భావించడం తప్పని, ఇళ్లలో వీటిని కుటుంబ సమేతంగా చూడలేక ఎంతో మంది బాధపడుతున్నారని అన్నారు.

ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న రోజా చాలా పెద్ద తప్పు చేస్తోందని, వెంటనే జబర్దస్త్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశాడు. ఓ మహిళగా ఉన్న రోజా, మహిళలను అవమానించే స్కిట్లను చూసి ఆనందిస్తూ, వాటిపై తీర్పు చెప్పడం ఏంటని ప్రశ్నించాడు. గతంలో తాము ఈటీవీ యాజమాన్యానికి విజ్ఞప్తులు పంపినా వారి నుంచి స్పందన రాలేదని చెప్పాడు. పటాస్ లో యాంకర్లు అందరిముందూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇది యువతను రెచ్చగొట్టి పెడదారి పట్టించే చర్యేనని, ప్రోగ్రాంలు ఆగేంతవరకు పోరు కొనసాగుతుందని స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Censor Board Member  Jabardasth  Pataas  Nandanam Diwakar  

Other Articles